AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లు అర్జున్ సినిమాలో సమంత ?? రూ. 3 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం

అల్లు అర్జున్ సినిమాలో సమంత ?? రూ. 3 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం

Phani CH
|

Updated on: Oct 03, 2025 | 8:00 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుపై రోజుకో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో హాట్ టాపిక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ కీలకమైన ప్రత్యేక పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సమంతను తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఒక స్పెషల్ రోల్ కోసం సమంతను చిత్ర యూనిట్‌ సంప్రదించినట్టు టాక్‌ నడుస్తోంది. ఆ పాత్రకు సమంత అయితే సరిగ్గా సరిపోతుందని భావించిన మేకర్స్ ఆమెతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ఈ ప్రత్యేక పాత్ర కోసం సమంతకు దాదాపు రూ. 3 కోట్ల వరకు ఆఫర్ చేశారని, దీనికి సమంత కూడా సుముఖంగా ఉన్నారని, ఆమె దాదాపుగా అంగీకరించినట్లేనని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సమంత, ఆ తర్వాత నటిగా, నిర్మాతగా తన కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ఆమెకున్న పాన్-ఇండియా క్రేజ్ దృష్ట్యా, అల్లు అర్జున్-అట్లీ సినిమాలో ఆమె నటిస్తే.. సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే, దీనిపై ఇంకా నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే, ఇదో సూపర్ హిట్ మూవీ అవుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాజాలో యుద్ధం మాటున మహిళలపై ఆకృత్యాలు ఎన్నో

రాజమండ్రిలో గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

విశాఖలో ఈదురుగాలుల బీభత్సం.. కూలిన చెట్లు, నేలకొరిగిన హోర్డింగ్‌లు