సంక్రాంతి ప్లానింగ్ నెక్ట్స్ లెవల్.. నవ్వి నవ్వి పోతారు
ప్రతీసారి సంక్రాంతి అంటే అన్ని జోనర్స్ ఆఫ్ సినిమాలు వస్తుంటాయి. కానీ ఈసారి అలా కాదు.. ఒకర్ని మించి మరొకరు నవ్వించడానికి వచ్చేస్తున్నారు. ఎంతసేపూ సీరియస్ సినిమాలేనా.. అందుకే ఈసారి వచ్చేవాళ్లు ఓన్లీ ఎంటర్‌టైన్మెంట్ అంటున్నారు. 2026 పండగ పూర్తిగా నవ్వుల సంక్రాంతిగా మారిపోతుంది. ఎన్ని రోజులైందో కదా ప్రభాస్‌ను ఇలా చూసి..! మరీ ముఖ్యంగా ట్రైలర్ అంతా ఒకెత్తు అయితే.. అందులో మరి చూత్తారేంట్రా పరిగెత్తండి అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ట్రెండ్ అయిపోతుందిప్పుడు.
వింటేజ్ డార్లింగ్ లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. సీరియస్ సినిమాల మధ్య ప్రభాస్‌కు స్ట్రెస్ బస్టర్‌గా మారింది రాజా సాబ్. ప్రభాస్ ఒక్కరే కాదు.. ఈసారి పండక్కి రాబోయే మిగిలిన హీరోలు కూడా ఎంటర్‌టైన్మెంట్‌నే నమ్ముకుంటున్నారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకరవరప్రసాగ్ గారూ ఎలా ఉండబోతుందో మళ్లీ చెప్పాలా..? ఇందులో 70 పర్సెంట్ కామెడీ.. 30 పర్సెంట్ ఎమోషన్ అని అనిలే క్లారిటీ ఇచ్చారు. నవీన్ పొలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒకరాజు సైతం పూర్తిగా ఎంటర్‌టైనరే. పండగ బొమ్మ అంటూ ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. జాతి రత్నాలు తర్వాత నవీన్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది.. మధ్యలో మిస్ శెట్టి చేసినా అది అనుష్క సినిమా. అలాగే రవితేజ, కిషోర్ తిరుమల సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మొత్తానికి ఈసారి పండగ అంతా నవ్వులే నవ్వులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha Ruth Prabhu: మార్పు మంచిదే అంటున్న సమంత
Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..
దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే
రూ.50 కోట్ల బీమా కోసం ఎంతకు తెగించాడంటే.. భార్య, తల్లిదండ్రుల హత్య
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

