Viral: బెడ్‌రూమ్‌లో ఇదేం పనిరా బాలరాజూ.! భార్యకు తెలియకుండా దుకాణం పెట్టేశావ్‌గా.. కట్ చేస్తే
ఓ ప్రబుద్దుడు చేసిన గలీజు పని ఇప్పుడు స్థానికంగా వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న ఫోటోలోని వ్యక్తిని చూశారా.? ఏం చేశాడో తెలిస్తే దెబ్బకు షాక్ అవుతారు. మరి ఆ డీటెయిల్స్ ఏంటి.? ఆ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా..

ఓ ప్రబుద్ధుడు తన బెడ్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలను అమర్చి.. భార్యతో చేసే లైంగిక చర్యలను రికార్డు చేశాడు. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి వాటిని స్నేహితులకు కూడా పంపాడు. ఇక ఆరోపణల నేపధ్యంలో నిందితుడ్ని పట్టుకునే పనిలో ఉన్నారు బెంగళూరు పోలీసులు. పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదైంది. బాధితురాలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. గత సంవత్సరం సెప్టెంబర్‌లో సయ్యద్ ఇనాముల్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. అయితే అప్పటికే అతడు వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని సమాచారం. ఆ విషయాన్ని బాధితురాలి దగ్గర దాచిపెట్టి.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడని ఆరోపణ. నిందితుడు సయ్యద్ తనను రోజూ వేధిస్తున్నాడని.. ఏకంగా 19 మండి మహిళలతో అతడికి అక్రమ సంబంధాలు ఉన్నాయని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది
బెడ్‌రూమ్‌లో రహస్య కెమెరాలను అమర్చి లైంగిక చర్యలను రికార్డ్ చేశాడు. ఆ ప్రైవేట్ వీడియోలను దుబాయ్‌లో నివసిస్తున్న తన స్నేహితులకు పంపించాడు. అంతేకాకుండా అతడి స్నేహితులకు శారీరిక సంబంధం పెట్టుకోవాలని నిందితుడు తన భార్యను బలవంతం చేశాడు. ఇక వివాహ సమయంలో నిందితుడికి కట్నం రూపంలో యమహా బైక్, 340 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. అలాగే భార్య తన ఒప్పందానికి ఒప్పుకోకపోవడంతో ఆమె తల్లిదండ్రులను కలవకుండా బంధించాడు నిందితుడు. విడాకులు ఇస్తానంటూ బెదిరించినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కాగా, మహిళ ఫిర్యాదు ఆధారంగా పుట్టెనహళ్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది చదవండి: అక్కడికి ఎలా ఎక్కావు మావ.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే




