Andhra: పాత బంగారాన్ని ఇచ్చి కమ్మలు కొంటానంది.. కట్ చేస్తే.. తను ఏం చేసిందంటే
పాత బంగారాన్ని ఇచ్చి.. రెండు కమ్మలు కూతురు కోసం కొంటానని చెప్పింది. ఆమె ఇచ్చిన గోల్డ్ చైన్‌ను యజమాని తనిఖీ చేశాడు. ఈలోగా ఆమె ఏం చేసిందంటే.? ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరలు ఇలా ఉన్నాయి.

అనంతపురం జిల్లా ఉరవకొండలో ఘరానా మోసం జరిగింది. ఓ జ్యువెలరీస్ షాప్ సిబ్బందికి మస్కా కొట్టింది ఒక మహిళ. స్థానికంగా ఉన్న నిజాముద్దీన్ జువెలరీస్ షాప్‌నకు కూతురు పెళ్లి కోసం కమ్మలు కొనాలని వచ్చింది ఓ మహిళ. పాత బంగారం ఎక్స్చేంజ్ చేసి కమ్మలు కొనాలని వచ్చినట్టుగా సదరు మహిళ పేర్కొంది. తన వెంట తీసుకొచ్చిన గోల్డ్ చైన్‌ను షాప్ యజమానికి ఇచ్చింది. అతడు ఆ గొలుసును పరీక్షించిన అనంతరం.. ఆమెకు కావాల్సిన బంగారు కమ్మలు ఇచ్చాడు. అవి తీసుకోగా మిగిలిన డబ్బులు ఇవ్వాలని.. ఆ డబ్బులతో తన కూతురుకు బట్టలు కొనాలని చెప్పి.. కంగారు పెట్టింది.
ఇది చదవండి: నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్
షాప్ యజమాని చైన్ తనిఖీ చేస్తుండగా.. అతడ్ని మాటలతో బురిడీ కొట్టింది. తిరిగి బంగారు గొలుస ఇచ్చే సందర్భంలో నకిలీ బంగారు గొలుస షాప్ యజమానికి అంటగట్టి జారుకుంది కిలాడీ లేడీ. ఆమె వెళ్ళిపోయాక.. చైన్ పరిశీలించి మోసపోయాయని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు షాప్ యజమాని. కాగా, ఈ తతంగం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది




