తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్.. ఢిల్లీలో పట్టుకున్న పోలీసులు!
ఢిల్లీ పోలీసులు భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ రాకెట్‌ను భగ్నం చేశారు. తిరుపతి నుండి అక్రమంగా తరలిస్తున్న 10 టన్నుల ఎర్రచందనం దుంగలను ఢిల్లీ STF స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. దీని విలువ మార్కెట్‌లో కోట్లలో ఉంటుందని అంచనా.

Red Sandalwood
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుండి అక్రమంగా తరలిస్తున్నట్లు 10 టన్నుల ఎర్రచందనం దుంగలను ఢిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) స్వాధీనం చేసుకుంది. ఇద్దరు అనుమానిత స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు.
సౌత్‌ఈస్ట్ ఢిల్లీకి చెందిన ఎస్‌టిఎఫ్ బృందం ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసింది. తదుపరి దర్యాప్తు జరుగుతోంది అని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రికవరీపై ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశం జరగనుంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
