Vivo Y19s: రూ. 10 వేల బడ్జెట్‌లో సూపర్ ఫోన్.. 50 ఎంపీతో పాటు మరెన్నో ఫీచర్స్
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో.. మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై19ఎస్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను థాయ్‌లాండ్‌లో లాంచ్ చేశారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లకు భారీగా ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా రూ. 10 వేల లోపు మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి ఓ బడ్జెట్ ఫోన్ లాంచ్ అయ్యింది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా గ్లోబల్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై19 ఎస్ పేరుతో ఈ ఫోన్‌ను థాయ్‌లాండ్‌లో తీసుకొచ్చారు. ఇంతకీ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వివో వై19 ఎస్ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ Unisock ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఇక ఇందులో 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.68 ఇంచెస్‌తో కూడన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు 1680 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్ HD+, 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ డిస్‌ప్లే 100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌వేరియంట్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొచ్చారు. ఎస్‌డీ కార్డు ద్వారా ఈ ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవచ్చు.
ఇక సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్‌లో సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు. 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ స్పీకర్లను ఇచ్చారు. ఈ ఫోన్ బరువు కేవలం 198 గ్రాములు కావడం విశేషం. ఈ ఫోన్ యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌కు సపోర్ట్ చేస్తుంది. ధర విషయానికొస్తే.. వివో వై19ఎస్ బేస్ వేరియంట్ 4జీబీ ర్యామ, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 10,796 కాగా 6జీబీ ర్యామ్ ధర రూ. 12,269గా నిర్ణయించారు. త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొస్తున్న ఈ ఫోన్ గ్లోసీ బ్లాక్, పెరల్ సిల్వర్, గ్లేసియర్ బ్లూ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..