AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Loans: కారు లోన్‌ తీసుకుంటున్నారా..? ఏ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ ఉందంటే..?

కారు లోన్ చాలామంది బ్యాంకుల నుంచి తీసుకుంటూ ఉంటారు. ఏ బ్యాంక్ నుంచి కారు లోన్ తీసుకుంటే మంచిదని ఆలోచించి తీసుకుంటారు. తక్కువ వడ్డీ, తక్కువ ప్రాసెసింగ్ ఫీజులు ఉండే బ్యాంకుల కోసం చూస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో కారు లోన్‌పై బ్యాంకులు వడ్డీలు ఇలా వసూలు చేస్తున్నాయి.

Venkatrao Lella
|

Updated on: Dec 16, 2025 | 4:49 PM

Share
కుటుంబ అవసరాల కోసం కొత్త కారు కొనాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ ఆర్దిక స్తోమత వల్ల కొనుగోలు చేయలేరు. కారు కొనాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడబెట్టుకున్న సొమ్ము అందుకు సరిపోదు. దీంతో కొంతమంది వ్యక్తుల నుంచి అప్పు తీసుకుని కారు కొనుగోలు చేస్తే.. మరికొంతమంది బ్యాంక్ నుంచి కారు లోన్ తీసుకుంటూ ఉంటారు.

1 / 5
దాదాపు అన్ని బ్యాంకులు కారు లోన్ మంజూరు చేస్తున్నాయి. సిబిల్ స్కోర్‌ను బట్టి వడ్డీని నిర్ణయిస్తున్నాయి. మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీకే కారు లోన్ పొందవచ్చు. గరిష్టంగా 7 సంవత్సరాల్లో మీరు తీసుకున్న కారు లోన్ తిరిగి ఈఎంఐ రూపంలో చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు కారు ధరపై 100 శాతం ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు 80 శాతం వరకు ఇస్తున్నాయి

2 / 5
కారు లోన్ తీసుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు చాలానే ఉంటాయి. ఇక వడ్డీ రేటు కూడా బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. అందుకే మీకు తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేసే బ్యాంకులను ఎంచుకోవడం ఉత్తమం. ప్రస్తుతుం బ్యాంకులు కారు రుణంపై 7 శాతం నుంచి 12 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి.

3 / 5
ఎస్‌బీఐలో 8.85 శాతం నుంచి వడ్డీ రేట్లు మొదలవుతుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ 9 శాతం, ఐసీఐసీఐ 9.15 శాతం, యూనియన్ బ్యాంక్ 7.80 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.85 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 8.60 శాతం, యాక్సిస్ బ్యాంక్ 8.90 శాతం, ఐడీఎఫ్‌సీ 9.99 శాతం నుంచి వడ్డీ రేట్లు మొదలవుతున్నాయి. మీ సిబిల్ స్కోర్‌ను బట్టి వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు.

4 / 5
ఇక ఫెడరల్ బ్యాంక్ 10 శాతం, కరూర్ వైశ్యా బ్యాంక్ 9 శాతం, కర్ణాటక బ్యాంక్ 8 శాతం, ఐడీబీఐ 7.95 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7.80 శాతం, టాటా క్యాపిటల్ 70.75 శాతం, కెనరా బ్యాంక్ 7.70 శాతం నుంచి కార్ల లోన్లపై వడ్డీ రేట్లు వసూలు చేస్తోంది.

5 / 5