- Telugu News Photo Gallery Business photos Gold and Silver rate today on 17th December 2025, Check Gold and Silver prices in Hyderabad, Vijayawada, Visakhapatnam
Gold Prices: బంగారం కొనుగోలు చేసేవారికి షాక్.. ఒకేసారి ఊహించని రీతిలో పెరిగిన ధరలు.. ఎంతంటే..?
Gold Cost: బంగారం, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారానికి ధరలు భారీగా పెరిగాయి. గత కొద్దిరోజుల్లో గోల్డ్ రేట్లలో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఊహించని రీతిలో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Updated on: Dec 17, 2025 | 12:29 PM

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు ఒకేసారి భారీగా పెరిగాయి. మంగళవారం కాస్త తగ్గి ఊరటనిచ్చిన గోల్డ్ రేట్లు.. బుధవారం నాటికి ఊహించని రీతిలో పెరిగాయి. బంగారం ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అర్ధం కావడం లేదు. ఈ ఊహించని మార్పులతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు షాక్ అవుతున్నారు. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,34,510గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.650 పెరిగింది. నిన్న ఈ ధర రూ.1,33,860గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం నిన్న రూ.1,22,700గా ఉండగా.. ఇవాళ రూ.600 పెరిగి రూ.1,23,300 వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండి రూ. 2,22,000 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా కేజీపై రూ.11 వేలు పెరిగింది.

అటు విజయవాడలో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,510గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,23,300 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.600 మేర ధర పెరిగింది. అటు విశాఖపట్నంలో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

ఇక బెంగళూరులో కూడా నిన్నటితో పోలిస్తే రూ.650 పెరిగింది. అటు చెన్నైలో నిన్నటితో పోలిస్తే రూ.550 పెరిగింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.1,34,730గా ఉండగా.. బుధవారం రూ.1,35,280 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం నిన్న రూ.1,23,500గా ఉండగా.. నేడు రూ.1,24,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.500 పెరిగింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,660గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,23,450 వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రాంతాలను బట్టి గేట్లు రేట్లు మారుతూ ఉంటాయి. ట్యాక్స్‌లు, రవాణా ఖర్చులను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.




