- Telugu News Photo Gallery Business photos Due to festival demand chicken prices have increased significantly
Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతో చూడండి..
తెలుగు రాష్ట్రాల్లో రోజుతో సంబంధం లేకుండా చికెన్ తింటూ ఉంటారు. ఇక ఆదివారం వస్తే చాలు.. చికెన్ షాపుల ముందు బారులే. అయితే నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ధర మరింత భారం కానుంది. ఇప్పటికే ధరలు పెరగ్గా.. త్వరలో మరింత పెరగనున్నాయని తెలుస్తోంది.
Updated on: Dec 17, 2025 | 12:56 PM

నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. త్వరలో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు వస్తుండటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుస పండుగలు వస్తుండటమే చికెన్ ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఇప్పుడు చికెన్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇప్పటికే గుడ్ల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. డజన్ గుడ్ల ధర రూ.95 నుంచి 100కి చేరుకుంది. గుడ్లతో పాటు చికెన్ ధరలు కూడా ఇప్పుడు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లైవ్ చికెన్ రిటైర్ ధర రూ.170 నుంచి 180 వరకు పలుకుతోంది. ఇక కేజీ చికెన్ రూ.270కి చేరుకుంది.

మొన్నటివరకు కేజీ చికెన్ రూ.230 నుంచి రూ.240 మధ్య ఉంది. ఇప్పుడు భారీగా పెరిగి రూ.270 వరకు చేరుకుంది. దీంతో పాటు గుడ్ల ధరలు కూడా పెరగడంతో సామాన్యుల జేబుకు చిల్లులు తప్పడం లేదు. ఆదివారం వస్తే చాలు చికెన్ షాపులు ముందు బారులు కడతారు.

ఇక రోజుతో సంబంధం లేకుండా మిగతా రోజుల్లో కూడా చికెన్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. శీతాకాలంలో చికెన్‌కు మరింత డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా పాల్ట్రీ యాజమానులకు దాణా ఖర్చులు పెరిగిపోయాయి. వీటితో పాటు త్వరలో పండుగలు వస్తుండటంతో ఇప్పటినుంచే భారీ స్థాయలో కోళ్లు వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి.

ధరలు పెరగానికి ఈ మూడు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇదే డిమాండ్ కొనసాగితే రానున్న రోజుల్లో కేజీ చికెన్ రూ.300కు చేరుకునే అవకాశముందని పాల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి చికెన్ ధరలు ఎంతవరకు పెరుగుతాయో చూడాలి.




