పార్టీ పదవుల భర్తీ స్పీడప్.. టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు.. ఇదిగో లిస్ట్..!.
పార్టీ పదవుల భర్తీని తెలుగుదేశం పార్టీ స్పీడప్ చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. ఇప్పటికే జాబితాను కూడా రెడీ చేసింది. ఆ సమాచారాన్ని ఎమ్మెల్యేలు, జిల్లా నేతలకు ఇప్పటికే పార్టీ పంపించినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో టీడీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. ఇంతకీ.. పదవులు దక్కబోతున్న ఆ నేతలెవరు?

పార్టీ పదవుల భర్తీని తెలుగుదేశం పార్టీ స్పీడప్ చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. ఇప్పటికే జాబితాను కూడా రెడీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను టీడీపీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. చట్టసభలకు ఎన్నిక కాని వారు, నామినేటెడ్ పోస్టులు దక్కని వారితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను జిల్లా అధ్యక్షుల బాధ్యతలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
తిరుపతి జిల్లాకు పనబాక లక్ష్మి, చిత్తూరు జిల్లాకు షణ్ముగం, అన్నమయ్య జిల్లాకు సుగవాసి ప్రసాద్, ప్రకాశం జిల్లాకు ఉగ్ర నరసింహారెడ్డి, అనంతపురం జిల్లాకు కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లాకు MS రాజు, నంద్యాల జిల్లాకు ధర్మవరపు సుబ్బారెడ్డి, విజయనగరం జిల్లాకు కిమిడి నాగార్జున, ఏలూరు జిల్లాకు బడేటి చంటి, కాకినాడ జిల్లాకు జోత్యుల నవీన్, బాపట్ల జిల్లాకు సలగల రాజశేఖర్, పల్నాడు జిల్లాకు కొమ్మాలపాటి శ్రీధర్, గుంటూరు జిల్లాకు పిల్లి మాణిక్యాలరావు, ఎన్టీఆర్ జిల్లాకు గద్దె అనురాధ, కృష్ణా జిల్లాకు వీరంకి గురుమూర్తి పేర్లు ఖరారు అయ్యాయి.
ఇక పశ్చిమగోదావరి జిల్లాకు రామరాజు, తూర్పుగోదావరి జిల్లాకు వెంకటరమణ చౌదరి, కోనసీమ జిల్లాకు గుత్తుల సాయి, విశాఖ జిల్లాకు చోడే పట్టాభిరామ్, అనకాపల్లి జిల్లాకు బత్తుల తాతబ్బాయ్, కర్నూలు జిల్లా వహీద్, నెల్లూరు జిల్లాకు బీదా రవిచంద్ర, కడప జిల్లాకు భూపేష్ రెడ్డిని ఎంపిక చేసినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ సమాచారాన్ని ఎమ్మెల్యేలు, జిల్లా నేతలకు ఇప్పటికే పార్టీ పంపించింది. ఒకటి, రెండు రోజుల్లో టీడీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




