AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గజ..గజ.. గజ.. ఇంత చలి ఎప్పుడూ లేదయ్యో..

గజ..గజ.. గజ.. ఇంత చలి ఎప్పుడూ లేదయ్యో..

Phani CH
|

Updated on: Dec 17, 2025 | 9:00 AM

Share

తెలుగు రాష్ట్రాలను తీవ్రమైన చలి వణికిస్తోంది, ముఖ్యంగా తెలంగాణలో పదేళ్ల రికార్డులను బద్దలు కొడుతూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తరాది గాలుల వల్ల ఈ పరిస్థితి నెలకొనగా, రాబోయే రెండు రోజులు పొగమంచుతో కూడిన చలి కొనసాగే అవకాశం ఉంది. ప్రయాణీకులు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీరు, వెచ్చని ఆహారం తీసుకోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం.

తీవ్రమైన చలితో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత పదేళ్ల రికార్డులను బద్దలు కొడుతూ చలి తీవ్రత కొనసాగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. గత 2 రోజులుగా ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే రెండు రోజుల పాటు చలి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అతిశీతల గాలులతోపాటు పొగమంచు పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా.. వేకువజామున ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా జాతీయ రహదారులపై వాహనాల్లో ప్రయాణించేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 9 గంటల వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలు ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీరికి శ్వాసకోశ సంబంధ వ్యాధులు, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే కీళ్ల నొప్పులు ఉన్నవారికి చలి తీవ్రత పెరిగినప్పుడు అవి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని… వారు వెచ్చని దుస్తులు ధరించి, తమ గది ఉష్ణోగ్రతను మరీ చల్లబడకుండా చూసుకోవాలంటున్నారు. ప్రతి రోజు గోరు వెచ్చని నీరు కనీసం 3-4 లీటర్లు తాగాలని సూచిస్తున్నారు. తాజాగా వండిన భోజనం, వెచ్చని సూప్‌లు తీసుకోవడం చాలా మంచిది. మసాలాలు తగ్గించి, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్‌ వన్‌… కాశీ తర్వాత ఇక్కడే…

వావ్‌.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా

నో డిలే.. నో డైవర్షన్‌.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో

ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ.. వైరల్ అవ్వడం కోసం మరీ ఇలా చేస్తావా ??

బరువు తగ్గించే ఇంజెక్షన్‌ ఇండియాకి వచ్చేసిందోచ్‌..