4 బస్సుల్లో ప్రయాణికుల సజీవ దహనం! వీడియో వైరల్
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై దట్టమైన పొగమంచు కారణంగా జరిగిన ఘోర ప్రమాదంలో బస్సులు వరుసగా ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవదహనమయ్యారని సమాచారం. భారీ సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉంది. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద తీవ్రత ఆందోళన కలిగిస్తోంది.
దట్టమైన పొగమంచు అనేక ప్రమాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా ఈ ఫాగ్ వల్ల ఎక్స్‌ప్రెస్ హైవేలపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన ప్రమాదంలో బస్సులు వరుసగా ఒకదాని వెంట మరోటి ఢీకొట్టాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం వరుసగా బస్సులన్నీ తగలబడ్డాయి. రోడ్డుపై పలు బస్సులు, కార్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సుల్లో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటం వల్ల బస్సులు మంటల్లో కాలిపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానికులు, వాహనదారులు మంటలను అదుపు చేశారు. సమీపంలోని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో బస్సుల మంటలకు సంబంధించి దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ ఘటనలో నాలుగు బస్సులు మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు ఆ వ్యక్తి వీడియోలో తెలిపాడు. భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఓ వైపు దట్టమైన పొగలు.. మరోవైపు బస్సుల్లో ప్రమాదానికి గురైన ప్రయాణికుల ఆర్తనాదాలతో.. ఆ ప్రదేశం భయానకంగా మారింది. అక్కడి దట్టమైన మంచు కారణంగా 7 బస్సులు,3 కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. దాదాపు 20 అంబులెన్స్‌ల ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే డిఎం,ఎస్పీతో సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్… కాశీ తర్వాత ఇక్కడే…
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ.. వైరల్ అవ్వడం కోసం మరీ ఇలా చేస్తావా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

