AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు

వేదికపై వినిపించిన ఓ గిరిజన యువకుడి విన్నపం నిమిషాల్లోనే కార్యరూపం దాల్చింది. కానిస్టేబుల్ నియామక సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో తెనుములబండ గ్రామానికి రూ.2 కోట్ల బీటీ రోడ్డు మంజూరు అయ్యింది. మాటకు పనిని జోడించిన ఈ క్షణం సభను ఆశ్చర్యంలో ముంచింది.

Andhra: వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
Pawan Kalyan
Ram Naramaneni
|

Updated on: Dec 16, 2025 | 10:06 PM

Share

కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. కానిస్టేబుల్‌గా నియమితుడైన గిరిజన యువకుడు లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు.  బాబూరావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రికి.. సీఎం అప్పగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన బాబూరావు చెప్పిన వివరాల మేరకు పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి..  పవన్ కళ్యాణ్‌కు పంపింది. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100
రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100
అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.
అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.