పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని యనమదుర్రు డ్రైన్ వద్ద 12 అడుగుల పొడవు, 80 కిలోల బరువున్న భారీ కొండచిలువ ప్రత్యక్షమై స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. నీటిపంపు ట్యాంక్‌లోకి చేరిన పామును అటవీశాఖ అధికారులు కరుణాకర్, సురేష్ కుమార్, రాంప్రసాద్, వన్యప్రాణి సంరక్షణ సంస్థ నిర్వాహకుడు మనీష్ సహకారంతో చాకచక్యంగా పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు.