Curd in Winter: శీతాకాలంలో పెరుగు తినాలా వద్దా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం, చలికాలంలో పగటిపూట పెరుగు తినడం సురక్షితం. రాత్రిపూట, సాయంత్రం తినకూడదు. ఫ్రిజ్లో పెట్టిన పెరుగును వాడొద్దు. పెరుగు ప్రోబయోటిక్ ఆహారం కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది. తక్కువ క్యాలరీలు, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం.