AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శీతాకాలపు చర్మ సౌందర్యం.. రోజూ స్నానానికి ముందే ఇలా చేస్తే.. మిళమిళ మెరవాల్సిందే!

శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యతో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అవును, శీతాకాలంలో చాలా మంది చర్మం పొడిబారడం, ముడతలు వంటి సమయస్యలను ఎదుర్కొంటారు. వీటి పరిష్కారానికి జనాలు అనేక క్రీమ్స్ వాడుతుంటారు. కానీ ఇవేవి వాడకుండానే కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. అదెలానో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Dec 16, 2025 | 4:14 PM

Share
చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారడం, ముడతలు పడడం జరుగుతుంది. ఇది చాలా చికాకును కలిగిస్తుంది.కాబట్టి మీరు శీతాకాలంలో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం చాలా మంది చర్మానికి బాడీ లోషన్లు, వివిధ ఉత్పత్తులను వాడుతారు. కానీ ఇవి కాస్త ఖర్చుతో కూడుకున్న పనులు. కాబట్టి ఇందుకోసం మీరు కొన్ని సులభమైన చిట్కాలను ఉపయోగించవచ్చు.

1 / 5
చలికాలంలో మీ చర్మం పొడిబారకుడా ఉండాలంటే మీరు రోజూ స్నానం చేసే ముందు ఈ నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల మీ చర్మం మెరుపుతో పాటు పొరిబాడకుండా ఉటుంది. అవును నువ్వుల నూనెతో శరీరాన్ని మసాజ్ చేయడం వల్ల చర్మం మరింత మెరుస్తుంది. కాబట్టి నువ్వుల నూనెను శరీరానికి రాసుకోవడం కలిగి ఇతర ప్రయోజనాలను కూడా ఇక్కడ తెలుసుకుందాం.

2 / 5
మెరిసే చర్మం: స్నానం చేసే ముందు, నువ్వుల నూనెతో మీ శరీరానికి తేలికపాటి మసాజ్ చేసేకోవడం ద్వారా మీ చర్మం ప్రకాశ వంతంగా మెరుస్తుంది. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇలా చేయడం ద్వారా శరీరం, మనస్సు రెండూ రిఫ్రెష్ అవుతాయి.

3 / 5
స్నానానికి ముందు ఈ నూనెతో శరీరమంతా సున్నితంగా మసాజ్ చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది, ఇది చర్మం పొడిబారడం నుండి ఉపశమనం కలిగిస్తుంది. చలి వాతావరణంలోని అనేక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి, ప్రతిరోజూ స్నానానికి ముందు నువ్వుల నూనెను శరీరానికి అప్లై చేసి 10-15 నిమిషాలు మసాజ్ చేయండి, తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. ఇది శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మనస్సును కూడా రిఫ్రెష్ చేస్తుంది.

4 / 5
నువ్వుల నూనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఈ, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ నూనెతో శరీరాన్ని సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది, కండరాలు బలపడతాయి. అలాగే, ఈ నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు, అలసట, ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

5 / 5