AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Shakeela : షకీలా జీవితంలో ఇంత దుఃఖం దాగుందా.. ? డబ్బుల కోసం సొంత తల్లి వేరే వ్యక్తి దగ్గరకు..

నటి షకీలా గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో హాస్యనటిగా అలరించిన ఆమె.. చాలా కాలం తర్వాత ఇటీవల బిగ్ బాస్ షో ద్వారా మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని కఠినమైన క్షణాలను పంచుకున్నారు. మేనల్లుడి వివాహంలో కుటుంబ సభ్యుల నుండి ఎదురైన అవమానం, తల్లితో తనకున్న సంబంధం, ఆర్థిక విషయాలలో ఆమె తల్లి చేసిన వ్యాఖ్యలు ఆమెను ఎంతగానో బాధించాయని వెల్లడించారు.  

Actress Shakeela : షకీలా జీవితంలో ఇంత దుఃఖం దాగుందా.. ? డబ్బుల కోసం సొంత తల్లి వేరే వ్యక్తి దగ్గరకు..
Shakeela
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2026 | 10:19 AM

Share

నటి షకీలా ఒక తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు భావోద్వేగ విషయాలను వెల్లడించారు. తన కుటుంబంతో, ముఖ్యంగా తన తల్లితో తనకున్న సంబంధం, అలాగే గతంలో ఎదుర్కొన్న కొన్ని అవమానకరమైన సంఘటనలను ఆమె పంచుకున్నారు. షకీలా తన మేనల్లుడి వివాహ రిసెప్షన్‌లో ఎదురైన ఒక సంఘటన గురించి మాట్లాడారు. పెళ్లికి హాజరు కాలేకపోయినా, సాయంత్రం రిసెప్షన్‌కు వెళ్లినట్లు ఆమె తెలిపారు. అక్కడికి వెళ్లగానే నేరుగా స్టేజ్ పైకి వెళ్లి నిలబడ్డారు. కొంతసేపటి తర్వాత, వరుడి సోదరి (తన మేనకోడలు) మధ్యలో వచ్చి, ఆమెను పక్కకు జరిగేలా చేసింది. ఆ తర్వాత మరో మేనకోడలు కూడా అదే విధంగా చేయడంతో, షకీలా మరింత దూరంగా జరిగాయి. చివరికి తన సోదరి కూడా వచ్చి తన పక్కన నిలబడటంతో, షకీలాకు పరిస్థితి అర్థం కాలేదు. తనను కావాలనే దూరం చేస్తున్నారని భావించి, ఆమె స్టేజ్‌పైనే ఏడ్చేశారు. నియంత్రించుకోలేకపోయి, అక్కడి నుండి కారు వద్దకు పరిగెత్తుకుపోయి వెళ్లిపోయారు. రెండు, మూడు రోజుల తర్వాత తన సోదరి ఫోన్ చేసి, క్షమాపణలు చెప్పారని షకీలా వెల్లడించారు. వధువు, “ఏ సినిమా ఆర్టిస్ట్ రాకూడదు” అని చెప్పిందని, అందుకే తన కుటుంబం ఆ విధంగా ప్రవర్తించిందని తన సోదరి వివరించిందని షకీలా పేర్కొన్నారు. ఈ విషయం షకీలాకు మరింత బాధను కలిగించింది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

షకీలా తన తల్లితో తనకున్న సంబంధాన్ని, ఆమె పట్ల తనకు “అసహ్యం” ఎందుకు ఏర్పడిందో వివరించారు. తన తల్లి తన సంపాదనను ఎత్తిపెట్టలేదని, తద్వారా తనకు ఆర్థిక భద్రత కల్పించలేదని ఆమె ఆరోపించారు. తన తల్లి బెడ్ పై డయాలసిస్ చేయించుకోవాల్సిన సమయంలో, తన వద్ద చికిత్సకు పైసా కూడా లేదని షకీలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తన సోదరికి ఫోన్ చేసి ఏడ్చినప్పుడు, తన సోదరి ఒక చేదు నిజాన్ని వెల్లడించిందని షకీలా తెలిపారు. తమ తల్లి గతంలో “నువ్వు నా పేరు మీద ఏదైనా ఆస్తి కొని పెడితే నేను ఎగిరిపోతాను (ఆస్తిని తీసుకొని వెళ్లిపోతాను)” అని చెప్పిందని తన సోదరి గుర్తుచేసింది. ఈ విషయం షకీలాను తీవ్రంగా కలచివేసింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి తల్లిని ఇదే విషయం అడిగినప్పుడు, తల్లి షాక్ అయ్యిందని, అయితే “అది ఎప్పుడో చెప్పానమ్మా, దానిని చూసుకొని నాకు నువ్వు ట్రీట్మెంట్ చేయకుండా పోతావా?” అని అడిగిందని షకీలా పేర్కొన్నారు. చిన్నప్పటి నుండి తన తల్లి తనను ఇతరులతో పోల్చి చూస్తుందని, తన పట్ల వివక్ష చూపుతుందని ఆమె అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

తన ఆత్మకథలో పేర్కొన్నట్లుగా, తన తల్లి తనను మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి వద్దకు ఒక హోటల్‌కు పంపిందని షకీలా అంగీకరించారు. “ప్లే గర్ల్స్” చిత్రం ఓకే అయిన సమయంలో, ఇంకా ఎలా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఈ సంఘటన జరిగిందని వివరించారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయని, కనుక వెళ్లమని తన తల్లి చెప్పిందని, మొదట తన సోదరితోనే ఆ హోటల్‌కు వెళ్ళినట్లు షకీలా వెల్లడించారు. ఈ సంఘటనలు ఆమె జీవితంలో ఎంతగానో ప్రభావితం చేశాయని, ఆమె వ్యక్తిత్వాన్ని, కుటుంబ సంబంధాలను మార్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..

Follow Us
రోజుకు 2 నిమిషాలు ఒంటి కాలిపై నిలబడి బ్రష్ చేయండి..! లాభాలు ఇవే
రోజుకు 2 నిమిషాలు ఒంటి కాలిపై నిలబడి బ్రష్ చేయండి..! లాభాలు ఇవే
నిందితుడి భార్య ఖాతా చూసి పోలీసుల మైండ్ బ్లాక్..!
నిందితుడి భార్య ఖాతా చూసి పోలీసుల మైండ్ బ్లాక్..!
పీఎఫ్‌ లబ్థిదారులకు బిగ్ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఇకపై
పీఎఫ్‌ లబ్థిదారులకు బిగ్ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఇకపై
ఇదేం సినిమా పిచ్చిగా ఉందన్నారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్.. ఇప్
ఇదేం సినిమా పిచ్చిగా ఉందన్నారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్.. ఇప్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
సంచలన ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి మళ్లీ నిరాశే
సంచలన ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి మళ్లీ నిరాశే
ఆదివారం మటన్ తింటున్నారా? అయితే,ఏ ముక్కల్లో ఎక్కువ కొవ్వు ఉంటుంది
ఆదివారం మటన్ తింటున్నారా? అయితే,ఏ ముక్కల్లో ఎక్కువ కొవ్వు ఉంటుంది
భార్య హత్య.. కోడలిపై మామ రివేంజ్.. ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ ట్రె
భార్య హత్య.. కోడలిపై మామ రివేంజ్.. ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ ట్రె
అందరూ చూస్తుండగానే నదిలోకి దూకిన యువతి!
అందరూ చూస్తుండగానే నదిలోకి దూకిన యువతి!
ఆషాఢంలో వీరికి పండుగే పండుగ.. అదృష్ట ద్వారం తెరుచుకోవడం పక్కా
ఆషాఢంలో వీరికి పండుగే పండుగ.. అదృష్ట ద్వారం తెరుచుకోవడం పక్కా