Smartphone: 2024లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్‌ ఫోన్‌ ఏంటో తెలుసా.?

2024 ఏడాది ముగింపు దశకకు చేరుకుంటోంది. మరో నెల రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. మరి ఈ నేపథ్యంలో 2024లో అత్యధికంగా అమ్ముడు పోయిన ఫోన్ లకు సంబంధించిన జాబితాలను విడుదల చేశారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెలురించిన ఈ జాబితాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Smartphone: 2024లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్‌ ఫోన్‌ ఏంటో తెలుసా.?
Smartphone
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 09, 2024 | 4:24 PM

నవంబర్‌ నెల ప్రారంభమైంది. మరో ఏడాది ముగిసేందుకు సిద్ధమైంది. క్యాలెండర్‌లో చివరి పేజీకి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్‌ ఫోన్స్‌ ఏంటి.? ఏయే కంపెనీకి చెందిన ఫోన్‌లు టాప్‌లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 2024లో ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ ఫోన్‌లో ఐఫోన్‌ 15 మొదటి వరుసలో నిలిచింది.

కౌంటర్‌ పాయింట్ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం ఐఫోన్‌ 15 తర్వాత అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ ఫోన్‌గా ఐఫోన్‌ 15ప్రో మ్యాక్స్‌, ఐఫోన్‌ 15 ప్రో స్మార్ట్‌ ఫోన్స్‌ నిలిచాయి. అధునాతన ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌లు భారీగా అమ్ముడుపోయాయి. ఇక ఈ ఫోన్‌ ధర భారీగా ఉన్నా పెద్ద ఎత్తున అమ్ముడుపోవడం విశేషంగా చెప్పొచ్చు.

యాపిల్ ఐఫోన్‌ 15 తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్‌లలో సామ్‌సంగ్ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా విక్రయిస్తున్న టాప్‌ 10 స్మార్ట్‌ ఫోన్‌లలో 5 మోడల్స్‌ సామ్‌సంగ్‌కు చెందినవే కావడం విశేషం. గ్యాలక్సీ 24కి ఎక్కువగా ఆదరణ లభిచింది. 2024 మూడవ త్రైమాసికంలో గ్లోబల్‌ సేల్స్‌లో టాప్‌ 10 మోడల్స్‌ 19 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

ఇక ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడిపోయిన ఫోన్‌ జాబితాలో రెడ్‌మీ 13సి నిలిచింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని తీసుకొచ్చిన ఈ ఫోన్‌ అమ్మకాలు జోరుగా సాగాయి. ఇలా 2024లో ఎక్కువగా అమ్ముడు పోయిన టాప్‌ 10 స్మార్ట్‌ఫోన్స్‌లో రెడ్‌మీ 13సి ఒకటిగా నిలిచింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!