IPL 2026: అతడు అత్యధిక ధర పలికే ప్లేయర్ అనుకునేరు.. చిన్న మిస్టేక్‌తో ఆశలన్నీ గోవిందా.!
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ వేలం జరగనుండగా.. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్.. తన ఐపీఎల్ లభ్యతపై, అలాగే తన రోల్ ఏంటన్నదానిపై క్లారిటీ ఇచ్చాడు. ఈ వివరణతో వేలంలో అతడి ధరపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 16న అబుదాబీ వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. ఈ మినీ వేలంలో మొత్తం 77 స్లాట్లు భర్తీ చేయాల్సి ఉండగా.. 355 మంది క్రికెటర్లు పోటీకి బరిలోకి దిగుతున్నారు. వీరిలో 240 మంది భారత క్రికెటర్లు కాగా, 110 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఇక ఈ వేలంలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ పూర్తిస్థాయి బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్నట్టు తన పేరును నమోదు చేయడంపై ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ చర్చపై తాజాగా గ్రీన్ స్పందించాడు. తన మేనేజర్ మిస్టేక్ వల్ల ఇలా నమోదు చేసి ఉంటారని.. అందుకే ఇలా వేలంలో తన పేరును రూ. 2 కోట్ల బ్యాటర్ స్లాట్‌లో రిజిస్ట్రేషన్ జరిగిందన్నాడు.
తన బౌలింగ్ పదునెక్కిందని.. అటు బ్యాట్‌తో పాటు ఇటు బంతితోనూ తాను సత్తా చాటుతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్ వేలంలో తన పేరును పూర్తిస్థాయి బ్యాటర్‌గా నమోదు చేసిన విషయం పూర్తిగా తన మేనేజర్ తప్పిదం అని.. అతడికి తాను బౌలింగ్ చేస్తానన్న విషయం నచ్చకపోవచ్చునని సెటైరికల్‌గా అన్నాడు. ఇలా చేయడం వల్ల వేలంలో తన ధరపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. 2023లో రూ. 17.50 కోట్లతో ముంబై ఇండియన్స్ కామెరాన్ గ్రీన్‌ను కొనుగోలు చేసింది. ఆ సంవత్సరం 452 పరుగులు చేయడమే కాదు 6 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 2024లో 255 పరుగులు, 10 వికెట్లు తీసి అదరగొట్టాడు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతోన్న యాషెస్ సిరీస్‌లోనూ కామెరాన్ గ్రీన్ రాణిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం గ్రీన్ ఫామ్ దృష్ట్యా.. అతడు వేలంలో భారీ ధరకు అమ్ముడుపోతాడని అంచనాలు నెలకొన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి




