Jio vs Airtel vs VI: అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్‌తో ముందుకొస్తున్న టెలికం కంపెనీలు.. అతి చవకైన ప్లాన్ ఇదే

భారతదేశంలో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. మొదట్లో డేటా చార్జీలు సామాన్యులకు అందనంత ఖరీదుగా ఉండేవి. అయితే జియో ఎంట్రీ తర్వాత అన్ని కంపెనీలు డేటా చార్జీలను సామాన్యులకు అందుబాటు ధరల్లోకి తీసుకు రావాల్సి వచ్చింది. కానీ ఇటీవల కాలంలో అన్ని కంపెనీ అన్‌లిమిటెడ్ ప్లాన్స్ అన్నీ ఇంచుమించు ఒకే ధరకు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లలో ఏ నెట్‌వర్క్ అతి తక్కువ ధరకు అన్‌లిమిటెడ్ ప్లాన్స్ అందిస్తున్నాయో? చూద్దాం.

Jio vs Airtel vs VI: అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్‌తో ముందుకొస్తున్న టెలికం కంపెనీలు.. అతి చవకైన ప్లాన్ ఇదే
Recharge Plan
Follow us
Srinu

|

Updated on: Nov 09, 2024 | 5:05 PM

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మూడు టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం గొప్ప రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులో ఉంచాయి. ముఖ్యంగా ఇతర నెట్‌వర్క్స్ నుంచి పెరుగుతున్న పోటీ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరకే రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ఇటీవల అన్ని కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్స్ ధరలను సవరించడంతో ప్రతి ప్లాన్ ఖరీదైనదిగా మారింది. మినిమం ఓ నెంబర్ మెయిన్‌టెయిన్ చేయాలంటే నెలకు కచ్చితంగా రూ.200 నుంచి 300 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు కంపెనీలకు చాలా మంది వినియోగదారులు ఝలక్ ఇచ్చారు. మూకుమ్మడిగా అందరూ ప్రభుత్వ టెలికం సంస్థ అయిన బీఎస్‌ఎన్ఎల్‌కు మారారు. వినియోగదారుల దెబ్బకు దిగొచ్చిన టెలికం సంస్థలు ధరలకు అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు కంపెనీల్లో ఏ కంపెనీ చవకైన రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులో ఉంచిందో? ఓ సారి తెలుసుకుందాం. 

జియో 198 ప్లాన్ 

జియో రూ. 198 ప్రీపెయిడ్ ప్లాన్‌తో మీరు 2 జీబీ డేటా, రోజువారీ 100 ఎస్ఎంఎస్‌తో పాటు ప్రతిరోజూ ఉచిత కాలింగ్ సౌకర్యం పొందవచ్చు దీంతో పాటు ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమాలకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. జియోకు సంబంధించిన అధికారిక సైట్ ప్రకారం ఈ ప్లాన్ అపరిమిత 5జీ డేటాను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ 379 ప్లాన్ 

ఎయిర్‌టెల్ రూ.379 ప్లాన్‌తో వినియోగదారులు ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా పొందవచ్చు. ఒక నెల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో ఉచిత కాలింగ్‌తో పాటు 100 ఎస్ఎంఎస్‌లు వినియోగదారులకు అందించవచ్చు. రూ. 379 ప్లాన్ ద్వారా 5జీ డేటా అందుబాటులో ఉండే ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను పొందవచ్చు. అలాగే అపోలో 24/7కు సంబంధించిన మూడు నెలల ఉచిత యాక్సెస్‌తో పాటు ఉచిత హలో ట్యూన్, లైవ్ టీవీ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

వీఐ 349 ప్లాన్ 

రూ.349 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 1.5 జీబీ  డేటా, ఉచిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అలాగే వినియోగదారులకు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటా అందుబాటులో ఉంటుంది. అంతేకాక ఈ ప్లాన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు వారాంతపు డేటా రోల్‌ఓవర్ సదుపాయాన్ని అందిస్తుంది. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మీ డేటా మిగిలి ఉంటే ఆ మిగిలిన డేటాను వారాంతాల్లో ఉపయోగించుకునే సదుపాయాన్ని పొందవచ్చు. 

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!