- Telugu News Photo Gallery Technology photos Google introduced new AI based feature in gmail desktop version
Gmail: జీమెయిల్‌లో సూపర్ ఏఐ ఫీచర్లు.. ఎలా ఉపయోగపడతాయో తెలుసా.?
ఒకప్పుడు మెయిల్ ఐడీని కేవలం కొందరు మాత్రమే ఉపయోగించే వారు. కానీ ఎప్పుడైతే ఆండ్రాయిడ్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయో ప్రతీ ఒక్కరికీ మెయిల్ ఐడీ తప్పనిసరిగా మారింది. ఇక మెజారిటీ జీ మెయిల్‌నే ఉపయోగిస్తుంటారు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా గూగుల్ జీమెయిల్‌లో ఫీచర్లను తీసుకొస్తోంది..
Updated on: Nov 09, 2024 | 9:33 PM

యూజర్ల అవసరాలకు అనుగుణంగా గూగుల్ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనివార్యంగా మారిన ప్రస్తుత తరుణంలో జీమెయిల్‌లో కూడా పలు ఏఐ ఫీచర్లను జోడించారు.

జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జెమినీ ఫీచర్లను తాజాగా జీమెయిల్‌లో ప్రవేశపెట్టారు. మెసేజ్‌ల డ్రాఫ్ట్, తప్పుల సవరణ కోసం గూగుల్ ఈ కొత్త ఫీచర్లను తీసుకొచ్చినట్లు తెలిపింది.

నిజానికి ఈ ఫీచర్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా కేవలం మొబైల్ యాప్స్‌కి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ఈ ఫీచర్‌ను వెబ్ వర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే. ముందుగా జీమెయిల్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. వెంటనే ‘హెల్ప్ మీ రైట్’ ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది. ఇది ఈమెయిల్స్ రాసుకోవటంలో సాయం చేస్తుంది. టైప్ చేయటం ఆరంభించి 12 పదాలకు చేరుకోగానే ఈమెయిల్ అంశం కింద ‘రిఫైన్ మై డ్రాఫ్ట్’ షార్ట్ కట్ కనిపిస్తుంది.

ఇందులో పొలిష్, ఫార్మలైజ్, ఎలాబరేట్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. షార్టెన్ యువర్ డ్రాఫ్ట్ లేదా రైట్ ఎ న్యూ డ్రాఫ్ వంటి ఆప్షన్లను మీ అవసరాలకు అనుగుణంగా సెలక్ట్ చేసుకోవచ్చు. వ్యాకరణ దోషాలకు కూడా ఈ కొత్త ఫీచర్‌తో చెక్ పెట్టొచ్చు.




