- Telugu News Photo Gallery Technology photos Whatsapp Tips: Follow these steps to transfer data without loosing any data
Whatsapp: వాట్సాప్‌లో డేటా మిస్ కాకుండా వేరే నంబర్‌కు బదిలీ చేయడం ఎలా..!
Whatsapp: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఫోన్‌లలో వాట్సాప్ ఉంటుంది. అయితే చాలా మందికి అప్పుడప్పుడు మొబైల్ నంబర్లను మారుస్తుంటారు. అలాంటి సమయంలో ఆ వాట్సాప్ నంబర్‌లో ముఖ్యమైన డేటా ఉంటుంది. వేరే నంబర్ మార్చినప్పుడు డాటా మొత్తం డిలీట్ అవుతుంటుంది..
Updated on: Nov 09, 2024 | 2:15 PM

Whatsapp: చాలా మందికి తరచూ తమ మొబైల్ నంబర్ మార్చుకునే అలవాటు ఉంటుంది. ఈ విధంగా వాట్సాప్ నంబర్‌ను మార్చే సమయంలో అందులో ఉన్న ముఖ్యమైన సమాచారం డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా సర్టిఫికేట్స్, ఆడియోలు, వీడియోలు, ఫోటోలు వంటి ముఖ్యమైన సమాచారం వాట్సాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంలో డేటాను కోల్పోకుండా ఉండాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి.

ముందుగా మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సెట్టింగ్ విభాగానికి వెళ్లండి. అక్కడ, 'అకౌంట్'పై క్లిక్ చేసి, 'నంబర్ మార్చు'పై క్లిక్ చేయండి. అప్పుడు స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని జాగ్రత్తగా గమనించాలి.

తర్వాత 'Next'పై క్లిక్ చేసి మీ పాత, కొత్త మొబైల్ నంబర్లను నమోదు చేయండి. మొబైల్ నంబర్లు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.

మొత్తం సమాచారాన్ని తనిఖీ చేసి, 'Done'పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డేటా మొత్తం కొత్త నంబర్‌కి బదిలీ అవుతుంది.




