మరో సరికొత్త రికార్డ్ దిశగా ఇస్రో.. బాహుబలి రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం
ఇస్రో LVM3-M6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన 6,500 కిలోల బ్లూబర్డ్-6 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇది భారత-అమెరికా అంతరిక్ష సహకారంలో కీలక మైలురాయి. ఈ భారీ ఉపగ్రహం గ్లోబల్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను మెరుగుపరుస్తుంది. గతంలో 2 టన్నుల పరిమితిని అధిగమించి, ఇస్రో 4 టన్నులకు పైగా సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్దమైంది. అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన బ్లూబర్డ్–6 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఈనెల 21న ప్రయోగించబోతోంది. ఇస్రో రూపొందించిన బాహుబలి (ఎల్‌వీఎం3–ఎం6) రాకెట్ ద్వారా దీనిని నిర్వహించనుంది. అక్టోబర్ 19వ తేదీనే అమెరికా నుంచి ఈ ఉపగ్రహం షార్‌కు చేరుకుంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. గతంలో పంపిన బ్లూబర్డ్ ఉపగ్రహాల కన్నా.. 10 రెట్ల అధిక డేటా సామర్థ్యంతో పని చేసేలా దీనిని రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇస్రో వాణిజ్య విభాగ సంస్థ అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తోంది. అంతరిక్ష రంగంలో భారత్, అమెరికాల సంయుక్త ప్రయోగాలలో ఇది ముఖ్యమైనది. ఇస్రో రాకెట్ ప్రయోగ తేదీని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ నెల 15 నుంచి 20 లోపు ప్రయోగం జరగనుంది. ఎల్‌వీఎమ్-3, M6 రాకెట్ ప్రయోగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇస్రో గతంలో రెండు టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి ప్రవేశ పెట్టగలిగేది. అంతకంటే బరువైన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలంటే ఫ్రెంచ్, గయా, రష్యా లాంటి దేశాల సహకారంతో ఉపగ్రహాలను ప్రవేశపెట్టేది ఇస్రో.. ఇప్పుడు ఆ పరిస్థితులను అధిగమించింది. ఇస్రో రూపొందించిన LVM – 03 వాహక నౌక ద్వారా 4 టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాలను సైతం నింగిలోకి తీసుకెళ్లనున్నారు. 6.5 టన్నుల బరువున్న అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశ పెట్టనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. టెక్సాస్ కేంద్రంగా పనిచేసే A స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన బ్లూబర్డ్ శ్రేణి ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవలను మెరుగ్గా అందించేందుకు రూపొందించారు. ఈ ఉపగ్రహం హై బ్యాండ్‌విడ్త్ నెట్వర్క్ అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. భూమిపై పనిచేస్తున్న మొబైల్ నెట్‌వర్క్ సేవలకు లైసెన్స్ స్పెక్ట్రమ్ ద్వారా అనుసంధానం చేసి.. సేవలను విస్తరించేలా ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఇప్పటికే అనుసంధాన పనులు, ఇంధన నింపుదల, తుది తనిఖీల పరిశీలనలు శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. ఇతర ఉపగ్రహాల కంటే మూడున్నర రెట్లు పెద్దదిగా, సుమారు పది రెట్లు అధిక డేటా సామర్థ్యంతో పనిచేయనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
BSNL బ్రాడ్‌బాండ్ ఫ్లాష్ సేల్.. బెనిఫిట్స్ ఇవే
ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా? సొమ్ము చేసుకున్న విదేశీ బ్రాండ్
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
బాక్సాఫీస్ విజయానికి కొత్త మంత్రం.. సినిమాలో ఇది ఉంటే హిట్ పక్కా
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...

