AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA 5th T20I: ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చేసిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ

India vs South Africa, 5th T20I: ఈ సిరీస్ నిర్ణయాత్మక దశకు చేరుకోవడంతో డేంజరస్ ఆల్ రౌండర్ రాక జట్టుకు ఎంతవరకు బలాన్నిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుత సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో, చివరి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

IND vs SA 5th T20I: ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చేసిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
Ind Vs Sa
Venkata Chari
|

Updated on: Dec 18, 2025 | 7:09 AM

Share

India vs South Africa, 5th T20I: దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదవ, నిర్ణయాత్మక టీ20 మ్యాచ్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఈ సిరీస్ నుంచి తప్పుకోవడంతో, అతని స్థానంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బెంగాల్ ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి పిలిచారు. ఇప్పటికే సిరీస్‌లో‌ టీమిండియా 2-1తో ముందంజలో నిలిచింది.

అక్షర్ పటేల్ అవుట్ – షాబాజ్ ఇన్

భారత్ వర్సెస్  దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే, అక్షర్ పటేల్ దూరం కావడంతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్ రౌండర్ అయిన షాబాజ్ అహ్మద్‌ను గంభీర్ ఎంపిక చేశాడు. అక్షర్ లాగే షాబాజ్ కూడా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించగల సామర్థ్యం ఉన్న ఆటగాడు కావడంతో అతనికి ఈ అవకాశం దక్కింది.

షాబాజ్ అహ్మద్ గణాంకాలు..

షాబాజ్ అహ్మద్ గతంలో టీమిండియా తరపున మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కలిపి అతను 5 వికెట్లు పడగొట్టారు. 2023 ఆసియా క్రీడల తర్వాత అతను మళ్ళీ జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.

ఐదవ టీ20 కోసం టీమిండియా స్క్వాడ్:

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు సమతూకంగా కనిపిస్తోంది. జట్టు వివరాలు ఇలా ఉన్నాయి:

బ్యాటర్లు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ.

ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్.

వికెట్ కీపర్లు: సంజూ శాంసన్, జితేష్ శర్మ.

బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

ఈ సిరీస్ నిర్ణయాత్మక దశకు చేరుకోవడంతో, షాబాజ్ అహ్మద్ రాక జట్టుకు ఎంతవరకు బలాన్నిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుత సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో, చివరి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
OTTలోకి వచ్చేసిన రియల్ లవ్ స్టోరీ..కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్
OTTలోకి వచ్చేసిన రియల్ లవ్ స్టోరీ..కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్
నెలకు రూ.లక్షన్నర జీతంతో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నెలకు రూ.లక్షన్నర జీతంతో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా..
నడిరోడ్డులో అత్త కాళ్ళు పట్టుకుని వేడుకున్న అల్లుడు..!
నడిరోడ్డులో అత్త కాళ్ళు పట్టుకుని వేడుకున్న అల్లుడు..!
రైళ్లలో పరిమితికి మించి లగేజీపై ఛార్జీల మోత..!
రైళ్లలో పరిమితికి మించి లగేజీపై ఛార్జీల మోత..!
ఇథియోపియాలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం..!
ఇథియోపియాలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం..!
తొలి రోజు టాటా సియార్రాను ఎంత మంది బుక్‌ చేసుకున్నారో తెలుసా?
తొలి రోజు టాటా సియార్రాను ఎంత మంది బుక్‌ చేసుకున్నారో తెలుసా?