కోనసీమ జిల్లాలోని ఐనవిల్లి లంకలో రెండు మొసళ్లు సంచరిస్తున్నాయి. పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. గత వారం రోజులుగా అటవీ అధికారులు మొసళ్లను పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేసి, హెచ్చరిక బోర్డులు స్థాపించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.