AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు అప్పటి వరకు మా క్యాస్ట్ ఏమిటో తెలియదు.. స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు!

నటన, కామెంట్స్, సమాజంలో జరిగే అన్యాయాలపై మాట్లాడినా దేన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా చెప్పడం ఆ స్టార్ నటి అలవాటు. దానికి కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చినా డోన్ట్ కేర్ అనేలా ఉంటారు నటి. సినిమాల్లో నటించడంపై కంటే వైవిద్యంగా కనిపించడానికి వైవిద్యభరితమైన ..

నాకు అప్పటి వరకు మా క్యాస్ట్ ఏమిటో తెలియదు.. స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు!
Tollywood Star Actress
Nikhil
|

Updated on: Dec 18, 2025 | 8:15 AM

Share

నటన, కామెంట్స్, సమాజంలో జరిగే అన్యాయాలపై మాట్లాడినా దేన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా చెప్పడం ఆ స్టార్ నటి అలవాటు. దానికి కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చినా డోన్ట్ కేర్ అనేలా ఉంటారు నటి. సినిమాల్లో నటించడంపై కంటే వైవిద్యంగా కనిపించడానికి వైవిద్యభరితమైన క్యారెక్టర్లు చేయడానికే సుముఖత చూపిస్తారు. చాలా మంది సమాజంలో జరిగే వాటి గురించి మాట్లాడటానికి వెనకడుగు వేస్తే ఈ నటి మాత్రం డేరింగ్ గా స్పందిస్తారు.

టాలీవుడ్‌లో అత్యంత ధైర్యవంతురాలైన నటిగా, స్పష్టమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తిగా మంచు లక్ష్మికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె ఏ విషయం మాట్లాడినా అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. అయితే, తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పెద్ద చర్చకు దారితీశాయి. తన ‘కులం’ గురించి, ఆ కులంలో పుట్టడం వల్ల తను ఎదుర్కొంటున్న విమర్శల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ మంచు లక్ష్మి అంత ఆవేదనతో ఏమన్నారు?

మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను ‘కమ్మ’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల కొన్నిసార్లు అనవసరమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక కులంలో పుట్టడం అనేది మన చేతుల్లో ఉండదు. కానీ, నేను ఫలానా కులంలో పుట్టినంత మాత్రాన నన్ను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం?” అని ఆమె ప్రశ్నించారు. కేవలం తన సామాజిక వర్గం కారణంగానే కొంతమంది తనపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

Manchu Lakshmi

Manchu Lakshmi

సినిమా ఇండస్ట్రీలో ప్రతిభకు గుర్తింపు ఉండాలి కానీ, కులానికి కాదని ఆమె కుండబద్ధలు కొట్టారు. తన తండ్రి మంచు మోహన్ బాబు గారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని, తాము కూడా తమ సొంత ప్రతిభతోనే గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేవలం కులం ప్రాతిపదికన ఒక వ్యక్తిని లేదా ఒక కుటుంబాన్ని జడ్జ్ చేయడం తప్పు అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మంచు లక్ష్మి చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కొంతమంది ఆమె నిజాయితీని మెచ్చుకుంటూ, “కుల వివక్ష ఏ రూపంలో ఉన్నా తప్పే” అని మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం సెలబ్రిటీలుగా ఇలాంటి విమర్శలను సహజంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా, ఎప్పుడూ సరదాగా ఉండే మంచు లక్ష్మి, తన మనసులోని బాధను ఇంత బహిరంగంగా పంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె రాబోయే ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. ఏదేమైనా, కులం అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమేనని, మనుషుల మధ్య దూరాన్ని పెంచే అడ్డుగోడ కాకూడదని ఆమె మాటల సారాంశం అని అర్థమవుతోంది.

తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ