అబ్బో.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట ఇంత గ్లామర్‏గానా మేడమ్..

Rajitha Chanti

Pic credit - Instagram

16 June 2026

తెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి ప్రియాంక జైన్. మౌనరాగం సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు.

ఈ సీరియల్ ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె.. తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరోసారి తన నటనతో బుల్లితెరపై సందడి చేసింది.

ఆ తర్వాత 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7'లో పాల్గొని మరింత పాపులారిటీని దక్కించుకుంది. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో తన ఫొటోషూట్స్ తో అలరిస్తుంది. 

ఈ తాజా ఫొటోషూట్‌లో ప్రియాంక జైన్ నీలం రంగు దుస్తుల్లో మెరిసిపోతోంది. ఈ అవుట్‌ఫిట్ ఆమె సహజ సౌందర్యాన్ని మరింతగా హైలైట్ చేస్తోందనే చెప్పాలి.

సింపుల్ మేకప్, స్టైలిష్ హెయిర్ స్టైల్ , ఆమె ముఖంలో ఉండే ఆకర్షణీయమైన చిరునవ్వు ఈ చిత్రాలకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. 

తన అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె పంచుకున్న ఈ ఫొటోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి. సీరియల్లలో ప్రియాంక ఎంతో పద్దతిగా కనిపించి మెప్పించింది.

తన క్యారెక్టర్‌కు తగ్గట్టుగా డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకోవడంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఈ బ్లూ డ్రెస్ ఆమెకు చాలా ఫ్యాషనబుల్‌గా ఉందని అంటున్నారు.

సీరియల్స్ పరంగానే కాకుండా, వెబ్ సిరీస్ మరియు ఇతర ప్రాజెక్టుల ద్వారా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. అటు నెట్టింట చాలా యాక్టివ్.