AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : టెస్టులు, టీ20లకు ఇప్పటికే గుడ్ బై.. రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్

Rohit Sharma : రోహిత్ శర్మ జూన్ 20న వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బీసీసీఐ లేదా రోహిత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ ప్రచారం పూర్తిగా ఫేక్ న్యూస్ అని స్పష్టమైంది.

Rohit Sharma : టెస్టులు, టీ20లకు ఇప్పటికే గుడ్ బై.. రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
Rohit Sharma (4)
Rakesh
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 1:24 PM

Share

Rohit Sharma : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పవర్‌ఫుల్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్ రిటైర్మెంట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం టీమిండియా అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ మొదటి మ్యాచ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు, కేవలం 16 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ తక్కువ స్కోరు నేపథ్యంలో కొందరు నెటిజన్లు, కొన్ని అన్‌అఫీషియల్ రిపోర్ట్స్ రోహిత్ శర్మ వన్డేల నుంచి త్వరలోనే తప్పుకోబోతున్నాడంటూ ప్రచారాన్ని మొదలుపెట్టాయి.

X, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ ప్రకారం.. చెన్నైలోని ప్రతిష్టాత్మక చెపాక్ స్టేడియంలో అఫ్గానిస్తాన్‌తో జూన్ 20న జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్ కాబోతోందని రాయబడింది. బీసీసీఐ, రోహిత్ శర్మ వయసు, అతని ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుని, 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతడిని చేర్చడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

అసలు వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

హిట్‌మ్యాన్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ రిటైర్మెంట్ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ వైరల్ ప్రచారం పూర్తిగా అవాస్తవం. రోహిత్ శర్మ రిటైర్మెంట్‌కు సంబంధించి అటు బీసీసీఐ గానీ, ఇటు రోహిత్ శర్మ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే లైక్స్, వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించి వైరల్ చేస్తున్నారు. కాబట్టి రోహిత్ శర్మ జూన్ 20న రిటైర్ అవుతున్నాడనే వార్త ముమ్మాటికీ ఫేక్ న్యూస్.

రెండు ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన హిట్‌మ్యాన్

రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా తరఫున కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే ఆడుతున్నాడు. అతను 2024 లో జరిగిన టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత గతేడాది మే 7, 2025 న టెస్టు క్రికెట్‌కు కూడా గుడ్ బై చెప్పేశాడు. కేవలం వన్డేలపైనే దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఉన్న రోహిత్, అఫ్గాన్ సిరీస్ తర్వాత కూడా మరికొన్నాళ్ల పాటు వన్డే ఫార్మాట్‌లో కొనసాగే అవకాశం ఉంది.

New Project

రోహిత్ శర్మ అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్

రోహిత్ శర్మ తన అద్భుతమైన కెరీర్‌లో ఇప్పటివరకు 67 టెస్టులు, 283 వన్డేలు, 159 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 4301 పరుగులు చేయగా.. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో అతని రికార్డులు అమోఘం. వన్డేల్లో 275 ఇన్నింగ్స్‌లలో 49 కంటే ఎక్కువ సగటుతో ఏకంగా 11,593 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే టీ20ల్లో 4,231 పరుగులతో పాటు 5 సెంచరీలు కొట్టాడు. ఇంతటి గొప్ప రికార్డులు ఉన్న లీడర్ రిటైర్మెంట్ పై వచ్చే రూమర్స్ ను నమ్మవద్దని టెక్ నిపుణులు, క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us