ఏం పిల్ల రా బాబూ.. అటు సినిమాలు.. ఇటు నెట్టింట తెగ రచ్చ చేస్తుంది..

Rajitha Chanti

Pic credit - Instagram

16 June 2026

ఇండస్ట్రీలో కొత్త తరం నటీమణులు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అందులో నటి శివాని నగరం ఒకరు.

'మెన్ టూ' వంటి చిత్రాలతో వెండితెరకు పరిచయమై, తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ యంగ్ బ్యూటీ, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.

ఎంతో సహజమైన నటన, గ్లామర్ పాత్రలకు తగ్గట్టుగా తనను తాను మలుచుకునే తీరు ఆమెను మిగతా హీరోయిన్ల కంటే భిన్నంగా నిలబెడుతున్నాయనే చెప్పాలి.

సినిమా రంగంలో శివాని నగరం కెరీర్ ఆరంభం నుండే వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ తన నైపుణ్యాన్ని నిరూపించుకుంటూ అవకాశాలు అందుకుంటుంది. 

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథా బలమున్న చిత్రాల్లో నటించేందుకు ఆమె ఆసక్తి చూపుతోంది. తన నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. 

సోషల్ మీడియాలో శివాని నగరం యాక్టివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫొటోషూట్స్, షూటింగ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.

ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన గ్లామర్ అండ్ స్టైలిష్ లుక్స్‌తో శివాని చేస్తున్న హంగామా నెటిజన్లను కట్టిపడేస్తోంది. మరోవైపు తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగు సినిమా పరిశ్రమలో ఈ తరం నటీమణుల పోటీలో శివాని నగరం తనదైన ముద్ర వేస్తుందని ఆశించవచ్చు. తాజాగా ఈ అమ్మడు లుక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.