జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సాధారణ వ్యక్తిలా సందడి చేశారు. టీ దుకాణంలోకి వెళ్లి టీ అడగగా, యజమానురాలు ఆశ్చర్యపోయి ఆత్మీయంగా పలకరించారు. చుట్టుపక్కల వ్యాపారులు ఫోటోల కోసం ఎగబడగా, ఎర్రబెల్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.