Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (December 17, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభ వార్తలు వింటారు. వ్యాపారాలు గతం కంటే బాగా అనుకూలంగా ఉంటాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (డిసెంబర్ 17, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా జోరందుకుంటాయి. ఆద్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది. అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఊహించని వస్తు లాభం ఉంటుంది. చిన్ననాటి మిత్రు లతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు, ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలపై కొద్దిగా శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాలపరంగా శుభ వార్తలు వింటారు. వ్యాపారాలు గతం కంటే బాగా అనుకూలంగా ఉంటాయి. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా పురోగమిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగాల్లో చిన్నపాటి ఇబ్బందులున్నా అధిగమిస్తారు. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. కుటుంబ ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగాలు చాలావరకు ప్రోత్సాహకరంగా సాగి పోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇష్టమైన మిత్రులతో సర దాగా గడుపుతారు. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. మీ సలహాలు, సూచన లకు సర్వత్రా విలువ ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం బాగా హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని ధన లాభం కలుగుతుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను, కొత్త వ్యూహాలను అమలు చేసి, ఆర్థికంగా లబ్ధి పొందు తారు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ): ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధించి లబ్ధి పొందుతారు. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరు గుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్ప టికీ, చేపట్టిన పనులు, వ్యవహారాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. బంధుమిత్రుల్లో మాటకు విలువ పెరుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ, రాబడి కొద్దిగా పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మన సులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మిత్రులతో వాదోపవాదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పరవాలేదు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెంచుతారు. వ్యాపారాలలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కానీ, కుటుంబ ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది. బంధువులతో మాట పట్టింపులు తలెత్తుతాయి.



