ఉసిరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన పండు. అయితే, ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి శరీరంలో ఆక్సలేట్లుగా మారి కిడ్నీ రాళ్లకు కారణమవుతుంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలు లేదా రాళ్లున్నవారు ఉసిరిని అధికంగా తీసుకోవడం ప్రమాదకరం. అటువంటి వారు ఉసిరిని నివారించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.