Tecno Spark Go 1: రూ. 8 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ కూడా మాములుగా ఉండవు
టెక్నో స్పార్క్ గో1 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గతేడాది తీసుకొచ్చిన టెక్నో స్కార్క్ గో 2024 ఫోన్‌కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే టెక్నో స్పార్క్ గో1లో.. 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించనున్నారు...

భారత టెక్ మార్కెట్లో బడ్జెట్ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థలు తక్కువ బడ్జెట్‌లోనే అధునాతన ఫీచర్లతో కూడిన ఫీచర్లను అందిస్తున్నారు. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు తక్కువ బడ్జెట్‌లోనే ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది.
టెక్నో స్పార్క్ గో1 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గతేడాది తీసుకొచ్చిన టెక్నో స్కార్క్ గో 2024 ఫోన్‌కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే టెక్నో స్పార్క్ గో1లో.. 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించనున్నారు. 720×1600 పిక్సెల్స్ రిజొల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్ యూనిసోక్ టీ615 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఆండ్రాయిడ్ 14గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం టాప్‌లో సెంటర్డ్ హోల్ పంచ్ స్లాట్ తో ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.
ఇక ఈ ఫోన్‌లో సెక్యూరిటీ పరంగా చూస్తే.. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ సెన్సర్‌లను అందిచారు. ఈ ఫోన్లో 15 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించనున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్ 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తుంది. ధర విషయానికొస్తే ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 8500గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




