- Telugu News Photo Gallery Technology photos Impressive new phones of Honor, Super features at low price, Honor 200 details in telugu
Honor 200: ఆకట్టుకుంటున్న హానర్ నయా ఫోన్స్.. మెంటల్ ఎక్కిస్తున్న సూపర్ ఫీచర్లు
భారతదేశ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో హానర్ స్మార్ట్ ఫోన్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇటీవల కాలంలో హానర్ ఎలాంటి కొత్త మోడల్స్ రిలీజ్ చేయడం లేదు. కానీ ప్రస్తుతం యూజర్లను ఆకట్టుకునేందుకు హానర్ కంపెనీ ఇటీవల సూపర్ ఫీచర్స్‌తో నయా స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. హానర్ 200 ప్రో, హానర్ 200 పేరుతో రిలీజ్ చేసిన రెండు స్మార్ట్ ఫోన్లు యూజర్లు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో రిలీజ్ చేసిన ఈ ఫోన్లు గురించి నిపుణులు ఏం చెబుతున్నారో? వంటి వివరాలను ఓ సారి చూద్దాం.
Updated on: Aug 18, 2024 | 8:30 PM

హానర్ 200, హానర్ 200 ప్రో రెండు ఫోన్లు గరిష్టంగా 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే ఆధారంగా పని చేస్తాయి. హానర్ 200 స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పని చేస్తే హానర్ 200 ప్రో స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్3ని ఆధారంగా పని చేస్తుంది.

భారతదేశంలో హానర్ 200 ధర రూ. 34,999 నుంచి ప్రారంభమవుతుంది, అయితే హానర్ 200 ప్రో ప్రారంభ ధర రూ. 57,999 నుంచి ఉంది. ముఖ్యంగా హానర్ 200 ప్రో, హానర్ 200 ఫోన్ల డిజైన్ యువతను అమితంగా ఆకర్షిస్తుంది. హానర్ 200 6.7 అంగుళాల ఎమో ఎల్ఈడీ క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంటే హానర్ 200 ప్రో 6.78 అంగుళాల ఎమోఎల్ఈడీ క్వాడ్-కర్వ్డ్ ఫ్లోటింగ్ డిస్ప్లేతో వస్తుంది.

ఈ రెండు ఫోన్లు 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేేలా 5200 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తాయి. ముఖ్యంగా ఇందులో తీసుకువచ్చిన ఏఐ ఫీచర్లు వినియోగదారుల మరింత ఆకర్షిస్తాయి.

హానర్ 200, హానర్ 200 ప్రో రెండు ఫోన్లు వాటి చిప్‌సెట్ మంచి పనితీరును అందిస్తున్నాయని యూజర్లు మెచ్చకుంటున్నారు. ముఖ్యంగా గేమింగ్ ప్రియులకు ఈ రెండు ఫోన్లు అనువుగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఈ రెండు ఫోన్స్‌లో ఏఐ టెక్నాలజీ కారణంగా అనేక లాక్ స్క్రీన్ డిజైన్‌ల నుంచి ఎంచుకునే సౌలభ్యం ఉంది.

హానర్ రెండు ఫోన్‌లు కూడా పోర్ట్రెయిట్ మోడ్‌లతో సహా అధునాతన ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌లతో ఫొటో ప్రియులను ఆకర్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. హానర్ రెండు ఫోన్లు 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ రిచ్ కెమెరా అద్భుత ఫొటోలను అందిస్తుంది. అయితే డల్ లైటింగ్‌లో మాత్రం కెమెరా పనితీరు యూజర్లను నిరుత్సాహ పరుస్తుంది.




