SSLV-D3 ప్రయోగం సక్సెస్‌.. ప్రకృతి విపత్తులపై ఇక డేగ కన్ను

SSLV-D3 ప్రయోగం సక్సెస్‌.. ప్రకృతి విపత్తులపై ఇక డేగ కన్ను

Phani CH

|

Updated on: Aug 18, 2024 | 4:12 PM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను‌ నింగిలోకి పంపింది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను‌ నింగిలోకి పంపింది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. చిన్న చిన్న శాటిలైట్లను అభివృద్ధి చేయటం, అందుకు అనుకూలమైన పేలోడ్‌ పరికరాలను రూపొందించే లక్ష్యంలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ‘ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌’ ఈవోఎస్‌-08ను తక్కువ ఎత్తులోని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఈ మిషన్‌ లక్ష్యం. దాదాపు 6 నెలల తర్వాత ఇస్రో చేపట్టిన రాకెట్‌ ప్రయోగమిది. కేవలం రెండు రోజుల ప్రణాళికతో చిన్న చిన్న శాటిలైట్స్‌ను తక్కువ ఖర్చుతో భూ కక్ష్యలోకి చేర్చేందుకు ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ3 రాకెట్‌తో సాధ్యమవుతుందని ఇస్రో సైంటిస్టులు తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Explainer: మంకీపాక్స్.. ముంచేస్తుందా ?? దీని లక్షణాలు ఏంటంటే ??

Explainer: అన్న క్యాంటీన్ మెనూ ఇదే.. ఆహార పరిమాణం ఎంతంటే ??

iSmart News: జిమ్ లో కసరత్తులు చేసిన నందమూరి నటసింహం.

500 మంది ఫైటర్లతో.. పవన్‌ పై ఫైట్ సీక్వెస్‌

Shah Rukh Khan: ఇంగ్లీష్‌ నేర్చుకున్నాకే.. హాలీవుడ్‌ గురించి ఆలోచిస్తా