AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి 4లక్షల టిక్కెట్లు.. సేల్ ఎప్పుడంటే?

ICC Men's Cricket World Cup 2023 Tickets: 4 లక్షల టిక్కెట్ల విక్రయం సెప్టెంబర్ 8 రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. వీటిని ప్రపంచ కప్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. మరోసారి టిక్కెట్ల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందని, అందుకే వెంటనే టిక్కెట్లు పొందేందుకు ప్రయత్నించాలని బీసీసీఐ అభిమానులకు సూచించింది. ఇది మాత్రమే కాదు, దీని తర్వాత మరో రౌండ్ విక్రయాలు ఉంటాయని, దాని గురించి త్వరలో అభిమానులకు సమాచారం ఇవ్వనున్నట్లు ఇండియన్ బోర్డ్ తెలిపింది.

World Cup 2023: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి 4లక్షల టిక్కెట్లు.. సేల్ ఎప్పుడంటే?
World Cup 2023 Tickets
Venkata Chari
|

Updated on: Sep 07, 2023 | 7:37 AM

Share

ICC Men’s Cricket World Cup 2023 Tickets: ప్రపంచ కప్ 2023 ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. అక్టోబర్ 5 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టోర్నీ ప్రారంభం కానుంది. భారత్‌లో జరగనున్న ఈ ప్రపంచకప్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొని ఉంది.అందుకే అందరూ టిక్కెట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది మాత్రమే విజయం సాధించారు. ఈ క్రమంలో ICC, BCCI విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. అభిమానుల నుంచి నిరంతర ఫిర్యాదుల తరువాత, BCCI మరో రౌండ్ టిక్కెట్ విక్రయాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో అన్ని మ్యాచ్‌ల కోసం మొత్తం 4 లక్షల టిక్కెట్లు సేల్‌లో ఉంచనున్నట్లు తెలిపింది.

ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలలో జాప్యం, ఆపై మార్పులు చేయడంతో టిక్కెట్ల విక్రయం ప్రారంభించడంలో చాలా జాప్యం జరిగింది. ఆగస్టు 24 నుంచి, భారతదేశం, ఇతర జట్ల మ్యాచ్‌ల కోసం పరిమిత టిక్కెట్లు వేర్వేరు రౌండ్లలో విక్రయించడం ప్రారంభించారు. భారత్ మ్యాచ్‌లనే కాకుండా మిగతా జట్ల మ్యాచ్‌ల టిక్కెట్లు కూడా నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అమ్ముడయ్యాయి.

ఇవి కూడా చదవండి

అన్ని మ్యాచ్‌ల టిక్కెట్‌లు అందుబాటులో..

తక్కువ సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడవడం.. ఆపై వెంటనే ‘సేల్ క్లోజ్’ అనే నోటిఫికేషన్ రావడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో 4 లక్షల టిక్కెట్లను విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. అభిమానుల అవసరాలను తీర్చడానికి, రెండవ రౌండ్ టిక్కెట్ విక్రయాలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు భారత బోర్డు సెప్టెంబర్ 6, బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ మ్యాచ్‌లు నిర్వహించే రాష్ట్ర సంఘాలతో మాట్లాడి ఈ 4 లక్షల టిక్కెట్లను విక్రయించేందుకు అంగీకరించినట్లు బోర్డు తెలిపింది.

ఈ రోజున విక్రయాలు ప్రారంభం..

ఈ 4 లక్షల టిక్కెట్ల విక్రయం సెప్టెంబర్ 8 రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. వీటిని ప్రపంచ కప్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. మరోసారి టిక్కెట్ల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందని, అందుకే వెంటనే టిక్కెట్లు పొందేందుకు ప్రయత్నించాలని బీసీసీఐ అభిమానులకు సూచించింది. ఇది మాత్రమే కాదు, దీని తర్వాత మరో రౌండ్ విక్రయాలు ఉంటాయని, దాని గురించి త్వరలో అభిమానులకు సమాచారం ఇవ్వనున్నట్లు ఇండియన్ బోర్డ్ తెలిపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ