Video: నేను క్రికెటర్ అయినందుకు చింతిస్తున్నాను.. జీవితంలో బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇదే: షాకిచ్చిన గౌతమ్ గంభీర్..
Indian Cricketer: తన మాటలతో లేదా సైగలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో సంచలనంగా నిలుస్తుంటాడు. ప్రపంచకప్ విజయాల హీరోగా పేరుగాంచిన గౌతీ.. తాజాగా ఎవరూ ఊహించని విషయాన్ని ప్రకటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంభీర్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఆన్సర్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో జీవితంలో అతిపెద్ద పశ్చాత్తాపం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. క్రికెటర్ అయినందుకు చింతిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Gautam Gambhir: భారత మాజీ ఓపెనింగ్ బ్యాటర్ గౌతమ్ గంభీర్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. 41 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ తన 13 ఏళ్ల సుదీర్ఘ ఆట జీవితంలో మూడు ఫార్మాట్లలో తనకంటూ స్పెషల్ పేరు సంపాదంచుకున్నాడు. కాగా, ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2007 ఫైనల్స్‌లో భారతదేశం తరపున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన గంభీర్.. టీ20 ప్రపంచ కప్(పాకిస్తాన్‌పై 75), 2011 వన్డే ప్రపంచకప్(97 vs శ్రీలంక), అలాగే టెస్ట్ క్రికెట్‌లోనూ బ్యాక్-టు-బ్యాక్ ఐదు సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడిగా నిలిచాడు. మాజీ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ టెస్ట్ బ్యాటర్ ర్యాంకింగ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. 2010లలో భారతదేశానికి నాయకత్వం వహించిన ఆరు మ్యాచ్‌లలో 100% విజయాల రికార్డును కలిగి ఉన్నాడు.
తన మాటలతో లేదా సైగలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో సంచలనంగా నిలుస్తుంటాడు. ప్రపంచకప్ విజయాల హీరోగా పేరుగాంచిన గౌతీ.. తాజాగా ఎవరూ ఊహించని విషయాన్ని ప్రకటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంభీర్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఆన్సర్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో జీవితంలో అతిపెద్ద పశ్చాత్తాపం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. క్రికెటర్ అయినందుకు చింతిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ది బడా భారత్ టాక్ షో సీజన్ 2లో ర్యాపిడ్ ఫైర్ సెగ్మెంట్‌లో పైవిధంగా మాట్లాడి షాక్ ఇచ్చాడు.




అలాగే, తాజాగా ఆసియాకప్ 2023లో వ్యాఖ్యతగా పనిచేస్తోన్న గంభీర్.. ప్రేక్షకులకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇలాగే కోహ్లీతోనూ ఐపీఎల్‌లో వివాదాలతో చర్చనీయాంశంగా నిలిచాడు.
ఏప్రిల్ 11, 2003న ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గంభీర్ తన ODI అరంగేట్రం చేశాడు. భారతదేశం 200 పరుగుల విజయానికి 22 బంతుల్లో 11 పరుగులు అందించాడు. అతను భారత పురుషుల క్రికెట్ జట్టు కోసం మొత్తం 58 టెస్టులు, 147 ODIలు, 37 T20లు ఆడాడు. వరుసగా 4154, 5238, 932 పరుగులు చేశాడు.
గౌతమ్ గంభీర్ వీడియో..
డిసెంబర్ 3, 2018న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన గంభీర్.. తన చివరి టెస్టును నవంబర్ 2016లో ఆడాడు. భారత్ తరపున గంభీర్ చివరి ODI, T20I మ్యాచ్‌లు వరుసగా జనవరి 2013, డిసెంబర్ 2012లో ఆడాడు.
ఆసియా కప్ 2023లో ప్రేక్షకులకు మిడిల్ ఫింగర్ చూపించిన గౌతమ్ గంభీర్..
Presenting BJP MP Gautam Gambhir 👇 pic.twitter.com/Unv5cwBYqW
— Srinivas BV (@srinivasiyc) September 4, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..