ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సిఫార్సు లేఖలతో వీఐపీ, వీవీఐపీ బ్రేక్ దర్శనాలకు వచ్చేవారు తప్పనిసరిగా టిక్కెట్ కొనుగోలు చేయాలి. ఆలయ ఆదాయానికి నష్టం జరుగుతున్నందున, రోజుకు 300 మంది సిఫార్సు లేఖలతో వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల మాదిరిగానే ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు.