Viral: క్లాస్‌రూమ్‌లో ప్రేమ పాఠాలు.. రొమాన్స్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.!
అక్కడ లవ్ ఎడ్యుకేషన్ చెప్తారట.. చూడటానికి కొత్త సబ్జెక్ట్‌లా ఉందని అనుకునేరు. ఈ సబ్జెక్ట్ అక్కడ బాగా ఫేమస్. మరి ఆ ప్లేస్ ఏంటి.? ఎందుకని అక్కడ ఈ సబ్జెక్ట్ చెప్తారు. అనే విషయాలను ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి మరి.

ప్రపంచంలో జనాభా అత్యధికంగా ఉన్న రెండో అతిపెద్ద దేశం చైనా. కానీ ఇప్పుడు ఆ దేశంలో జనాభా ప్రతీ ఏటా విపరీతంగా తగ్గిపోతుందట. దీంతో తాజాగా అక్కడి ప్రభుత్వం కిలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 30 ఏళ్ళుగా అమల్లో ఉన్న పన్నులపై మినహాయింపు రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల చైనాలో గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌ల ధరలు పెరగబోతున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచే వీటిపై 13 శాతం విలువ ఆధారిత పన్ను అమల్లోకి వచ్చింది. చైనా జనాభా తగ్గటానికి అక్కడ దంపతులకు పిల్లలు పుట్టకపోవడం, వృద్దుల సంఖ్య పెరగడం ప్రధాన కారణాలు. అదే విధంగా 1980 నుంచి 2025 వరకు అమల్లో ఉన్న వన్ చైల్డ్ పాలసీ ప్రభావం వల్ల దాదాపు 35 ఏళ్ళ పాటు ఒకే బిడ్డ విధానం అమల్లో ఉండటం వల్ల పిల్లల సంఖ్య తగ్గింది. మరో వైపు అక్కడి ప్రజలు పిల్లల విద్య, సంరక్షణ, ఇంటి నిర్వహణ, వైద్య ఖర్చులు భారంగా భావిస్తూ.. యువత పెళ్లిని వాయిదా వేస్తున్నారు.
కొందరు పెళ్లి పట్ల అసలు సుముఖత కూడా చూపడం లేదు. దీని వల్ల ఆ దేశంలో కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో ఆర్ధిక వృద్ది మండగమనంలోకి వెళుతోంది. పెన్షన్‌లు తీసుకునేవారు పెరుగుతుండటం, ఆరోగ్య వ్యవస్థపై ప్రభుత్వం అధికంగా ఖర్చు చేయాల్సిన నేపధ్యంలో చైనా దేశ జనభా పెరుగుదలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారికి సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, లవ్ ఎడ్యుకేషన్, పెళ్లిళ్లకు ప్రోత్సహకాలు, గర్భ నిరోధక వస్తువులపై పన్ను పెంపు వంటి విధానాలను అనుసరిస్తోంది.
లవ్ ఎడ్యుకేషన్ అంటే..
చైనాలో ఇప్పుడు లవ్ ఎడ్యుకేషన్‌పై ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం అక్కడ యువత పెళ్లి, కుటుంబాన్ని భారంగా భావిస్తోంది. దీని వల్ల వివాహాలు తగ్గిపోవడం, పిల్లలు పుట్టకపోవడంతో జనాభా సంఖ్యపై పెను ప్రభావం చూపిస్తోంది. అందుకే ప్రేమ, పెళ్లి, కుటుంబం పట్ల సానుకూల దృక్పదాన్ని అక్కడ ప్రజల్లో పెంచేందుకు లవ్ ఎడ్యుకేషన్ పేరుతొ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. లవ్ ఎడ్యుకేషన్ అంటే రొమాన్స్ నేర్పడం కాదు.. భార్య, భార్తల మధ్య జీవితం అనే పొదరిల్లులో నిర్మితమయ్యే విధంగా చూడటమే ఇందులో భాగం. కుటుంబ విలువలను కాపాడుకోవడంతో పాటు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కూడా ఇందులో భాగం.
మన దగ్గర పరిస్థితి ఏంటి..
ప్రపంచంలో జనాభా అత్యధికంగా ఉన్న పది దేశాల్లో భారత మొదటిది. ఇటివలే మనం చైనాను అధిగమించి మొదటి స్థానంలోకి వచ్చాం. మన దేశ జనాభా సుమారుగా 144 కోట్లు. ఇది ప్రపంచ జనాభాలో 6వ వంతు. మన దేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. అందుకే యంగ్ కంట్రిగా పిలుస్తారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




