School Holidays: ఇక్కడ జనవరి 5 వరకు పాఠశాలలు బంద్.. సీఎం కీలక ప్రకటన!
School Holidays: విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే ఎగిరి గంతులేస్తారు. ఒక వైపు పండగల సీజన్, మరో వైపు చలిగాలల తీవ్రత. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వరుసగా సెలవలు వస్తున్నాయి. తీవ్రమైన చలిగాలుల కారణంగా విద్యార్థులకు సెలవులను ప్రరకటించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి..

School Holidays: ఈ కొత్త ఏడాదిలో పండగల సీజన్ కారణంగా విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే సంక్రాంతి సెలవులు రానున్నాయి. ఇదిలా ఉంటే.. ఉత్తర భారతదేశంలో చలిగాలులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అనేక రాష్ట్రాలు తీవ్రమైన చలితో నూతన సంవత్సరాన్ని స్వాగతించాయి. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో పొడి చలిగాలులు వీస్తున్నాయి. వాతావరణ శాఖ అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ దృష్ట్యా చలి పెరిగే అవకాశం ఉందని, దీని దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల్లో 5వ తరగతి వరకు జనవరి 5 వ తేదీ వరకు పూర్తిగా మూసి వేయనున్నారు. చలి కారణంగా పాఠశాలలను మూసివేయడంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక సూచనలు జారీ చేశారు. అయితే ఈ సెలవులు జనవరి 1 వరకు మాత్రమే ఉండేది. చలి గాలుల కారణంగా సెలవులను పొడిగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో విద్యార్థులకు మరో ఐదు రోజుల పాటు సెలవులు లభించాయి.
పెరుగుతున్న చలి గురించి ముఖ్యమంత్రి యోగి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను జనవరి 5 వరకు మూసివేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు, యుపి బోర్డు, ఐసిఎస్‌ఇ-సిబిఎస్‌ఇ నిర్వహిస్తున్న పాఠశాలలతో సహా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు జనవరి 5 వరకు మూసి ఉంటాయి.
ఇది కూడా చదవండి: Prepaid Recharge Plans: తక్కువ ధరల్లో 365 రోజుల పాటు వ్యాలిడిటీ అందించే 15 రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
ఇదిలా ఉండగా, రాజస్థాన్‌లో శీతాకాల సెలవులు డిసెంబర్ 25, 2025 నుండి జనవరి 5, 2026 వరకు ఉన్నాయి. ఈ సెలవు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుంది. 2025-26 శివిర పంచాంగ్ ప్రకారం సెలవు తేదీలను నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: Fact Check: ఈ ఏడాది మార్చిలోగా రూ.500 నోట్లు రద్దు అవుతాయా? కేంద్రం క్లారిటీ!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
