AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: తొంగి చూస్తే ఒక్కసారిగా గుండె గుభేల్.. ఫ్రిడ్జ్‌లో దాగి ఉన్నదేంటో తెలుసా.. ఇదిగో వీడియో

విశాఖ సిందియా ప్రాంతంలో షిప్ యార్డ్ క్వార్టర్స్.. ఇల్లు షిఫ్ట్ అయ్యే క్రమంలో.. ఫ్రిజ్ ను ఖాళీ చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఫ్రిడ్జ్‌లో ఉన్న సామాన్లన్నీ ఖాళీ చేసేసారు. ఇంతలో ఫ్రిడ్జ్ పై భాగం నుంచి.. చిన్న తల కనిపిస్తుంది. ఏదో బల్లి అయి ఉంటుందని లైట్ తీసుకున్నారు. కానీ ఎక్కడ వచ్చిన డౌట్.. కాస్త తేడాగా ఉంది అని అనుకున్నారు. దగ్గరకు వెళ్లి.. అది బల్లి కాదు.. పాము..

Andhra: తొంగి చూస్తే ఒక్కసారిగా గుండె గుభేల్.. ఫ్రిడ్జ్‌లో దాగి ఉన్నదేంటో తెలుసా.. ఇదిగో వీడియో
Snake Found In Refrigerator
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jan 03, 2026 | 12:05 PM

Share

ఈ మధ్యకాలంలో పాములు అక్కడ ఇక్కడ అని కాదు.. ఎక్కడికైనా వచ్చేస్తున్నాయి. ఆహారం కోసమో.. లేక ఆవాసం కోసమో.. జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. కొన్ని ఇళ్లల్లోకి నేరుగా దూరిపోతుంటే.. మరికొన్ని ఏసీల్లోను, ఫ్రిజ్లలోను.. చొరబడుతున్నాయి. అలాంటి వింత అనుభవమే ఎదురైంది విశాఖ సిందియా లోని షాపియార్డ్ ఉద్యోగి కుటుంబానికి. క్వార్టర్ షిఫ్ట్ అయ్యే క్రమంలో.. రిఫ్రిజిరేటర్ ను ఖాళీ చేశారు. అదే సమయంలో ఫ్రిడ్జ్ పై భాగంలో.. లోపల నుంచి ఏదో తొంగి చూస్తున్నట్టు గుర్తించారు. బల్లి అయి ఉంటుందని అనుకుని.. తరిమే ప్రయత్నం చేశారు. కానీ అది బల్లి కాదు.. పాము అని గుర్తించి గుండెలు పట్టుకున్నారు. వెంటనే స్నేక్ క్యాచార్ నాగరాజుకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన నాగరాజు.. పామును పట్టుకునే ప్రయత్నం చేస్తే.. అది ఎక్కడ నుంచి దూకి పారిపోయేందుకు యత్నించింది. వెంటనే దాన్ని పట్టుకున్నాడు నాగరాజు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

ఆ పాము అదే..

దాన్ని బ్రాంజ్ బ్యాక్ వైన్ స్నేక్ గా గుర్తించారు. చెట్లపై ఎక్కువగా నివసిస్తూ.. కప్పలు, బల్లులు, కీటకాలను తింటూ ఉంటుంది. ఇది నాన్ వెనమస్.. అంటే విషరహిత సర్పం. సగటున నాలుగు అడుగుల వరకు ఈ పాములు పెరుగుతాయి. చెట్లు పొదలు బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తాయి. చాలా చురుగ్గా కదులుతూ.. దూకే స్వభావాన్ని కలిగి ఉంటాయి ఈ పాములు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌