AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle Vs Cancer: రోజువారీ ఈ అలవాట్లు మీ ఒంట్లో ప్రాణాంతక క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయ్‌.. వెంటనే మానేయండి

ఇటీవలి కాలంలో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దైనందిన జీవనశైలి, తప్పుడు ఆహార అలవాట్లు ఈ విధమైన ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ధూమపానం, నిద్రలేమి కూడా క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. ఇది నోరు, ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా పరోక్ష ధూమపానం చేసేవారికి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఏ దైనందిన అలవాట్లు ఈ రకమైన ఆరోగ్య సమస్యలను పెంచుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

Lifestyle Vs Cancer: రోజువారీ ఈ అలవాట్లు మీ ఒంట్లో ప్రాణాంతక క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయ్‌.. వెంటనే మానేయండి
Cancer Warning Signs
Srilakshmi C
|

Updated on: May 08, 2026 | 9:55 PM

Share

నేటి కాలంలో చాలా మంది ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారు. ఈ ఆహారాలలో ఉండే రసాయనాలు, నిల్వచేసే పదార్థాలు, అధిక చక్కెర శాతం శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఎక్కువ నూనెతో తయారుచేసిన లేదా వేయించిన ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బయటి నుండి తెచ్చిన ఆహారాన్ని వేడి ప్లాస్టిక్‌లో నిల్వ చేయడం వల్ల కూడా హానికరమైన రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి.

నిద్రలేమి, ఒత్తిడి పాత్ర ఎంత?

తగినంత నిద్ర లేకపోవడం శరీర సహజ సమతుల్యతకు భంగం కలిగిస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, స్క్రీన్‌ను అధికంగా ఉపయోగించడం, క్రమరహిత దినచర్యలు శరీర రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. అంతేకాకుండా నిరంతర ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

క్యాన్సర్‌ తొలి లక్షణాలు ఏలా ఉంటాయంటే?

నిపుణుల అభిప్రాయం ప్రకారం దీర్ఘకాలిక బలహీనత, శరీరం ఆకస్మిక బరువు తగ్గడం, శరీరంలోని ఏ భాగంలోనైనా గడ్డలు కనిపించడం, నిరంతర నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలవు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సకాలంలో రక్త పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. నిర్లక్ష్యం చేయడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌