AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం, రోటీ కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసుకోకపోతే ప్రమాదమే

డయాబెటిస్.. నేటి కాలంలో ప్రతి ఇంట్లోనూ ప్రధాన సమస్యగా మారింది. మందులు వాడటమే కాకుండా, మన దైనందిన జీవితంలో చేసుకునే చిన్న చిన్న మార్పులు ఈ మహమ్మారిని అదుపులో ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్వేతా జె పంచల్ షుగర్ పేషెంట్ల కోసం కొన్ని సూచనలు చేశారు.

అన్నం, రోటీ కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసుకోకపోతే ప్రమాదమే
Rice N Roti
Nikhil
|

Updated on: May 08, 2026 | 11:10 PM

Share

మధుమేహం ఉన్నవారు కేవలం మందుల మీద మాత్రమే ఆధారపడకుండా, తమ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా అదుపు చేయవచ్చు. ముఖ్యంగా మనం తినే ఆహారం, తినే సమయం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చాలామందికి తెలియని కొన్ని చిన్న పొరపాట్లు షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగడానికి కారణమవుతాయి. అవేంటో తెలుసుకుంటే డయాబెటిస్ మేనేజ్‌మెంట్ చాలా సులభం అవుతుంది.

రైస్ మరియు రోటీ కాంబినేషన్ వద్దు!

చాలామంది భోజనంలో అన్నం మరియు రోటీ రెండింటినీ కలిపి తీసుకుంటుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల శరీరానికి ఒకేసారి భారీగా కార్బోహైడ్రేట్లు అందుతాయని, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను భారీగా పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఏదో ఒకటి మాత్రమే తీసుకోవడం ఉత్తమం. అలాగే, ఏ భోజనం ప్రారంభించే ముందైనా సరే.. ఖచ్చితంగా ఫైబర్ అధికంగా ఉండే సలాడ్లు తీసుకోవాలి. ఇది ఆహారం నుండి చక్కెరను శరీరం నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది.

రాత్రి భోజనం మరియు నడక:

రాత్రి 7 గంటల లోపు డిన్నర్ పూర్తి చేయడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల షుగర్ లెవల్స్ అదుపు తప్పే అవకాశం ఉంటుంది. అలాగే, ప్రతి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఇన్సులిన్ పనితీరును వేగవంతం చేస్తుంది.

పండ్లపై దాల్చినచెక్క పొడి:

పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా, వాటిలో ఉండే సహజ చక్కెరలు (Fructose) కొన్నిసార్లు ఇన్సులిన్ సెన్సిటివిటీపై ప్రభావం చూపుతాయి. అందుకే పండ్లు తినేటప్పుడు వాటిపై కొద్దిగా దాల్చినచెక్క పొడిని చల్లుకోవడం వల్ల షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. దాల్చినచెక్క ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. 2050 నాటికి ప్రతి ఎనిమిది మందిలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడే అవకాశం ఉందని అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ హెచ్చరిస్తోంది. కాబట్టి, ఈ చిన్న చిన్న అలవాట్లను నేటి నుంచే ప్రారంభించి మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.

Follow Us