- Telugu News Photo Gallery Cricket photos From Sansju Samson to yuzvendra these 5 star players out from india odi world cup 2023 squad
World Cup 2023: ప్రతిభ ఫుల్‌గా ఉన్నా ఏం లాభం.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్‌లో చోటివ్వని సెలెక్టెర్లు.. లిస్టులో ఐదుగురు..
Team India ODI World Cup 2023 Squad: వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు. మరో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు అవకాశం లేకుండా పోయింది. శాంసన్‌తో పాటు టీమ్ ఇండియా జట్టులో కనిపించని కొంతమంది స్టార్ ప్లేయర్‌ల జాబితా ఇక్కడ ఉంది. ఈ లిస్టు నుంచి దిగ్గజ ప్లేయర్లకు మొండిచేయి చూపించారు.
Updated on: Sep 07, 2023 | 8:46 PM

India Odi Squad: అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌నకు భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కనిపించనున్నాడు.

అలాగే కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. మరో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు అవకాశం లేకుండా పోయింది. శాంసన్‌తో పాటు టీమిండియా జట్టులో కనిపించని కొంతమంది స్టార్ ప్లేయర్‌ల జాబితా ఇప్పుడు చూద్దాం..

1- శిఖర్ ధావన్: లెఫ్టార్మ్ ఓపెనర్ శిఖర్ ధావన్ టీమ్ ఇండియా తరపున 137 వన్డేల్లో 6793 పరుగులు చేశాడు. కానీ, 37 ఏళ్ల ధావన్‌ను ఈ వన్డే ప్రపంచకప్ జట్టులోకి తీసుకోలేదు.

2. Ashwin - రవిచంద్రన్ అశ్విన్: టీమిండియా తరపున 113 వన్డే మ్యాచ్‌ల నుంచి 151 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్రపంచకప్‌నకు ఎంపిక కాలేదు. డబ్ల్యూటీసీలోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈసారి కచ్చితంగా వన్డే ప్రపంచకప్ జట్టులో చేరతాడని అంతా భావించారు. కానీ, చివరకు మొండిచేయి చూపించారు.

3- భువనేశ్వర్ కుమార్: భారత్ తరపున 121 వన్డే మ్యాచ్‌లు ఆడిన స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్ మొత్తం 141 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈసారి ఆయనను కూడా ఎంపికకు పరిగణనలోకి తీసుకోలేదు.

4- యుజ్వేంద్ర చాహల్: ఈ వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందన్న నమ్మకంతో ఉన్న చాహల్ కూడా ఎంపిక కాలేదు. చాహల్ 72 వన్డేల్లో 121 వికెట్లు పడగొట్టాడు. అయితే స్పిన్నర్‌గా జట్టులో చోటు దక్కించుకోవడంలో విఫలమయ్యాడు.

5- సంజు శాంసన్: వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందని ఆశించిన సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. టీమిండియా తరపున 13 మ్యాచుల్లో 55.71 సగటుతో 390 పరుగులు చేసిన శాంసన్ కూడా జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాడు.




