- Telugu News Photo Gallery Cricket photos Former Sri Lanka cricketer Sachithra Senanayake was arrested on Wednesday over match fixing allegations
Match Fixing Allegations: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన శ్రీలంక మాజీ స్పిన్నర్..
Sachithra Senanayake: లంక ప్రీమియర్ లీగ్ (LPL) 2020 ఎడిషన్ గేమ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు సేనానాయకేపై ఆరోపణలు వచ్చాయి. 38 ఏళ్ల సచిత్ర సేనానాయకే 2012, 2016 మధ్య ఒక టెస్టు, 49 ODIలు, 24 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు మూడు నెలల పాటు అమలులో ఉండే ప్రయాణ నిషేధాన్ని విధించాలని ఇమ్మిగ్రేషన్, ఎమిగ్రేషన్ కంట్రోలర్ జనరల్‌ను ఆదేశించింది.
Updated on: Sep 06, 2023 | 8:11 PM

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేనానాయకే బుధవారం అరెస్టయ్యాడు. ఈ ఉదయం లొంగిపోయిన ఆయనను స్పోర్ట్స్ కరప్షన్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అరెస్ట్ చేసింది. మూడు వారాల క్రితం ఆయన విదేశాలకు వెళ్లకుండా కోర్టు నిషేధం విధించింది.

లంక ప్రీమియర్ లీగ్ (LPL) 2020 ఎడిషన్ గేమ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు సేనానాయకేపై ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు ఆటగాళ్లను ఫిక్సింగ్ చేసేలా ప్రలోభపెట్టాడని సమాచారం.

38 ఏళ్ల సచిత్ర సేనానాయకే 2012, 2016 మధ్య ఒక టెస్టు, 49 ODIలు, 24 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.

కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు మూడు నెలల పాటు అమలులో ఉండే ప్రయాణ నిషేధాన్ని విధించాలని ఇమ్మిగ్రేషన్, ఎమిగ్రేషన్ కంట్రోలర్ జనరల్‌ను ఆదేశించింది.

మాజీ ఆఫ్ స్పిన్నర్‌పై క్రిమినల్ అభియోగాలు మోపాలని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగం అటార్నీ జనరల్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించినట్లు కోర్టుకు తెలిపింది.




