Shubman Gill : ఏమైంది గిల్ బ్రో.. వరుసగా 9 మ్యాచ్‌లలో ఫెయిల్.. ఇలా అయితే నీ కెప్టెన్సీ పోస్ట్ డౌటే ?
శుభ్‌మన్ గిల్ ప్రదర్శనపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. టీమిండియాకు ఎంతో కీలకమైన ఈ యంగ్ బ్యాటర్, ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన వన్డే సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో అతని బ్యాట్ నుంచి పరుగులే రాలేదు. అయితే, ఇది ఒక్క సిరీస్‌కు సంబంధించిన సమస్య కాదు. గత రెండు నెలలుగా అంటే ఆసియా కప్ నుంచి చూసుకుంటే గిల్ వరుసగా 9 ఇన్నింగ్స్‌లలో తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు.

Shubman Gill : శుభ్‌మన్ గిల్ ప్రదర్శనపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. టీమిండియాకు ఎంతో కీలకమైన ఈ యంగ్ బ్యాటర్, ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన వన్డే సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో అతని బ్యాట్ నుంచి పరుగులే రాలేదు. అయితే, ఇది ఒక్క సిరీస్‌కు సంబంధించిన సమస్య కాదు. గత రెండు నెలలుగా అంటే ఆసియా కప్ నుంచి చూసుకుంటే గిల్ వరుసగా 9 ఇన్నింగ్స్‌లలో తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు. కెప్టెన్‌గా తొలి విజయం సాధించినా, బ్యాటర్‌గా అతను విఫలమవడంతో విమర్శకులు ఇప్పుడు అతనిపై దృష్టి సారించారు.
ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో శుభ్‌మన్ గిల్ పూర్తిస్థాయిలో కెప్టెన్సీని ప్రారంభించాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌ను డ్రా చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అదే ఫామ్‌ను ఆస్ట్రేలియాలోనూ కొనసాగిస్తాడని అభిమానులు ఆశించారు. ఆస్ట్రేలియా సిరీస్‌తోనే గిల్ కెప్టెన్సీకి ఆశించిన ఫలితం రాలేదు. చివరి వన్డేలో గెలిచి కెప్టెన్‌గా తొలి విజయాన్ని నమోదు చేసినప్పటికీ, బ్యాటర్‌గా అతను నిరాశపరిచాడు.
సిడ్నీలో జరిగిన చివరి వన్డేలో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మూడు మ్యాచ్‌లలో అతని స్కోర్‌లు వరుసగా 24, 9, 10. అంటే, మొత్తం సిరీస్‌లో కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. శుభ్‌మన్ గిల్ ఫామ్ కోల్పోవడం ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తోనే మొదలవలేదు. వాస్తవానికి, ఈ పరిస్థితి సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ నుంచే మొదలైంది. ఆసియా కప్‌లో గిల్‌ను వైస్-కెప్టెన్‌గా సెలక్ట్ చేయడంపై అప్పటికే విమర్శలు వచ్చాయి. ఆ టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ తర్వాత, అతను ఆడిన తదుపరి 6 మ్యాచ్‌లలో కూడా చెప్పుకోదగ్గ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
ఆసియా కప్‌లోని 6 ఇన్నింగ్స్‌లు, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లోని 3 ఇన్నింగ్స్‌లు కలిపితే, గిల్ వరుసగా 9 ఇన్నింగ్స్‌లలో తన బ్యాట్‌తో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. ఈ 9 ఇన్నింగ్స్‌లలో ఆసియా కప్ సూపర్-4 రౌండ్‌లో పాకిస్తాన్‌పై చేసిన 28 బంతుల్లో 47 పరుగుల ఇన్నింగ్స్‌ను మినహాయిస్తే, అతను ఒక్కసారి కూడా 50 పరుగుల మార్కును చేరుకోలేకపోయాడు.
కొన్ని నెలల క్రితం వరకు, గిల్ రెడ్ బాల్ క్రికెట్‌లో (టెస్ట్ ఫార్మాట్) ఫామ్‌లో లేడనే విమర్శలు వచ్చాయి. కానీ లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్‌లో మాత్రం పరుగులు బాగానే చేసేవాడు. అయితే, ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. వైట్ బాల్ (లిమిటెడ్ ఓవర్ల) క్రికెట్‌లో అతను పరుగులు చేయడానికి బాగా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. గిల్ ఫామ్‌లోకి రావడానికి ఇప్పుడు మరో అవకాశం ఉంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ పాల్గొనబోతున్నాడు. ఈ సిరీస్‌లో 2-3 మంచి ఇన్నింగ్స్‌లు ఆడగలిగితే, టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు గిల్ కూడా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




