Virat Kohli : వన్డే క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ తర్వాత మనోడే
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో అద్భుతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రికార్డును బద్దలు కొట్టి, వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు.

Virat Kohli : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో అద్భుతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రికార్డును బద్దలు కొట్టి వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ ఘనత సాధించడం ద్వారా కోహ్లీ తన ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్ తర్వాత నిలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా విరాట్ కోహ్లీ.. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ సంగక్కర రికార్డును బ్రేక్ చేయడానికి 54 పరుగులు చేయాల్సి వచ్చింది. కుమార సంగక్కర 404 వన్డేల్లో 14,234 పరుగులు చేశాడు. కోహ్లీ తన 293వ వన్డే ఇన్నింగ్స్‌లోనే 14,255* పరుగులు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను అజేయంగా 74 పరుగులు చేసి, భారత్‌కు 9 వికెట్ల విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఇప్పుడు తన ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్ వెనకే నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌లలో 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ సాధించిన ఈ రికార్డుకు అతని అద్భుతమైన యావరేజ్ బలం. వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన టాప్ 10 బ్యాటర్లలో 50 కంటే ఎక్కువ సగటు (దాదాపు 57.69) ఉన్న ఏకైక ఆటగాడు కోహ్లీ కావడం విశేషం. సచిన్ సగటు 44.83గా ఉంది.
𝐑𝐮𝐧 𝐌𝐚𝐜𝐡𝐢𝐧𝐞 🔢
Virat Kohli surpassed Kumar Sangakkara in the tally for Most Runs in ODI cricket history 🫡
Scorecard ▶ https://t.co/4oXLzrhGNG#TeamIndia | #3rdODI | #AUSvIND | @imVkohli pic.twitter.com/bf9lnynpn2
— BCCI (@BCCI) October 25, 2025
𝐓𝐡𝐞 𝐌𝐚𝐧. 𝐓𝐡𝐞 𝐌𝐲𝐭𝐡. 𝐓𝐡𝐞 𝐌𝐢𝐥𝐞𝐬𝐭𝐨𝐧𝐞 𝐌𝐚𝐜𝐡𝐢𝐧𝐞. 👑🙇🏼♂
The second-highest run-getter in ODI history, Virat Kohli! May his reign continue! 🙌 pic.twitter.com/P0EzD8uV9K
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 25, 2025
వన్డేలు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను కలిపి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో కూడా కోహ్లీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.
ఈ ప్రదర్శనతో కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో 75వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతేకాకుండా, ఆస్ట్రేలియాపై వన్డేలలో 2500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ విజయాన్ని సులభతరం చేశాడు. తన కెరీర్ చివర్లో ఉన్నప్పటికీ, కోహ్లీ తన ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్ తర్వాత స్థానంలో నిలిచి తన వన్డే కెరీర్‌ను ముగించే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




