IND vs AUS : రోహిత్-కోహ్లీ రిటైర్మెంట్ సంకేతాలు? ఆస్ట్రేలియాకు గుడ్ బై చెప్పడంతో ఎమోషనల్ అయిన ఫ్యాన్స్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన భాగస్వామ్యంతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.

IND vs AUS : ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన భాగస్వామ్యంతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. సిడ్నీ వన్డే అనంతరం రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఆస్ట్రేలియా దేశానికి గుడ్ బై చెప్పడం, వారి వ్యాఖ్యల తీరు చూస్తుంటే, వారు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నారేమోననే ఊహాగానాలు సోషల్ మీడియాలో చెలరేగుతున్నాయి. దీంతో అభిమానులు ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు.
సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ అద్భుతంగా ఆడి, 168 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌కు విజయాన్ని అందించారు. అయితే, ఈ మ్యాచ్ తర్వాత వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి.
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు వచ్చి ఆడటం తనకు చాలా ఇష్టమని, 2008 నాటి జ్ఞాపకాలు ఇంకా తాజాగా ఉన్నాయని చెప్పారు. అయితే, “మళ్లీ ఆస్ట్రేలియాలో ఆడటానికి వస్తానో లేదో తనకు తెలియదు” అని వ్యాఖ్యానించారు. భారత మాజీ కెప్టెన్ చేసిన ఈ ప్రకటనను అభిమానులు రిటైర్మెంట్ సంకేతంగా పరిగణిస్తున్నారు.
మరోవైపు, విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియాకు రావడం, అక్కడ ఆడటం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా అభిమానులు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ చేతులెత్తి వారి అభివాదాన్ని స్వీకరించారు.
విరాట్ కోహ్లీ అభినందనలు స్వీకరించిన తీరుపై గతంలో కూడా చర్చ జరిగింది. అడిలైడ్ వన్డే తర్వాత కూడా విరాట్ అలాగే అభిమానులకు అభివాదం చేయడంతో, అతను మళ్లీ మైదానంలోకి రాడనే ఊహాగానాలు వచ్చాయి. అయినప్పటికీ, అతను సిడ్నీ మ్యాచ్‌లో 74 పరుగుల బలమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే రోహిత్ శర్మ “మళ్లీ ఆస్ట్రేలియాకు వస్తానో లేదో తెలియదు” అని చెప్పడం, కోహ్లీ అంతకుముందు చేసిన అభివాదం, ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు కలిసి ఆస్ట్రేలియాకు వీడ్కోలు పలికేలా మాట్లాడటం… ఈ అంశాలన్నీ కలిసి సోషల్ మీడియాలో వారి రిటైర్మెంట్ గురించి చర్చను పెంచాయి.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నారు. చాలా మంది అభిమానులు హార్ట్ ఇమోజీలతో, ఏడుస్తున్న ఎమోజీలను షేర్ చేస్తూ, తమ అభిమాన ఆటగాళ్లు రిటైర్ అవ్వకుండా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
Virat Kohli and Rohit Sharma both thanked Australia and the Australian crowd ❤️ pic.twitter.com/M3YykqlD69
— MR. 𝕏 (@Krish_RC_) October 25, 2025
Virat Kohli and Rohit Sharma both thanked Australia and the Australian crowd. 🥹❤️#INDvsAUS @cricbuzz @BCCI @ImRo45 @imVkohli #roko pic.twitter.com/4mMGgNJZXx
— IndianTeamCricket 🧢 (@sourav18das) October 25, 2025
Virat Kohli and Rohit Sharma signs off from Australia. pic.twitter.com/sTYhkbmfDn
— lucknow वाले (@akhraash) October 25, 2025
Virat Kohli and Rohit Sharma both thanked Australia and the Australian crowd. 🥹📷#roko pic.twitter.com/KTAaymYiNx
— Sahil Makol (@SahilMakol2) October 25, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




