Messi Net Worth: మెస్సీ నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసా? మొత్తం ఆస్తుల విలువ తెలిస్తే షాకవుతారు!
Messi Net Worth: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారతదేశంలో ఉన్నారు. ఇది మెస్సీ భారతదేశానికి రెండవ పర్యటన. గతంలో అతను 2011లో వెనిజులాతో జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ కోసం అర్జెంటీనా జట్టుతో కలిసి భారతదేశాన్ని..

Messi Net Worth: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారతదేశంలో ఉన్నారు. ఈ పర్యటన తొలి రోజు కోల్‌కతాలో ప్రారంభమైంది. తర్వాత హైదరాబాద్, ముంబై ఇలా పర్యటన కొనసాగింది. మెస్సీ ప్రముఖులను కలిశారు. ఇది మెస్సీ భారతదేశానికి రెండవ పర్యటన. గతంలో అతను 2011లో వెనిజులాతో జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ కోసం అర్జెంటీనా జట్టుతో కలిసి భారతదేశాన్ని సందర్శించాడు. ఆ మ్యాచ్ కూడా ప్రత్యేకమైనది. ఎందుకంటే మెస్సీ మొదటిసారి అర్జెంటీనాకు నాయకత్వం వహించాడు.
1987 జూన్ 24న అర్జెంటీనాలోని రోసారియోలో జన్మించిన లియోనెల్ మెస్సీ ప్రపంచంలోని గొప్ప ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకరు. ప్రపంచంలోని అత్యుత్తమ పురుష ఫుట్‌బాల్ ఆటగాడికి అందించే బ్యాలన్ డి’ఓర్‌ను ఆయన 2009 – 2023 మధ్య ఎనిమిది సార్లు గెలుచుకున్నారు. 2022లో అర్జెంటీనాను FIFA ప్రపంచ కప్‌కు నడిపించడం ద్వారా ఆయన చరిత్ర సృష్టించారు. ఇంత ముఖ్యమైన విజయాలతో మెస్సీ నికర విలువను పరిశీలిద్దాం.
ఇది కూడా చదవండి: Gold, Silver Price: మహిళలకు షాకింగ్ న్యూస్.. వారం రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలుసా?
ప్రస్తుతం ఈ క్లబ్ ద్వారా అతడు పొందే ఆదాయం నెలకు 2.67 మిలియన్ డాలర్లుగా ఉందంటే అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక బార్సిలోనా క్లబ్ ద్వారా మెస్సీ లెక్కకు మిక్కిలి ఆర్జిస్తున్నాడని నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతే కాదండోయ్ .. టాప్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేస్తూ మెస్సీ భారీగా సంపాదించుకుంటున్నారు. ఉదాహరణకు అడిడాస్, పెప్సీ వంటి బ్రాండ్లు మెస్సీ క్రేజ్ దృష్ట్యా అతడికి ఏడాదికి రూ. 70 మిలియన్లకు పైగా ముట్టజెప్పుతున్నట్లు వార్తలున్నాయి.
ఇవే కాకుండా డిజిటల్ కాయిన్ల రూపంలోనూ అతడు మనీ సేవ్ చేస్తున్నాడు. ఇక ఆట, ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో పెట్టాడు. అంతేకాదు.. హోటల్ వ్యాపారాలనూ పెద్ద ఎత్తున విస్తరించాడు. ఇలా అటు క్లబ్‌లు.. ఇటు ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్న మెస్సీ.. నికర ఆస్తుల విలువ ఏడు వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంది అంచనా.
ఇది కూడా చదవండి: PPF: పీపీఎఫ్‌లో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది? లక్షాధికారి కావచ్చు!
భారత పర్యటన సమయంలో మెస్సీ నికర విలువ
లియోనెల్ మెస్సీ నికర విలువ దాదాపు $850 మిలియన్లు. అంటే దాదాపు రూ.7,000 కోట్లు (సుమారు $70 బిలియన్లు). అయితే ఆయన భారత పర్యటన సమయంలో వివిధ వర్గాలు ఆయన నికర విలువ దాదాపు రూ.7,000-8,500 కోట్లు (టీమ్ ఇండియా కంటే దాదాపు నాలుగు నుండి నాలుగున్నర రెట్లు) ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఇలా అటు క్లబ్‌లు.. ఇటు ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్న మెస్సీ.. భారత కరెన్సీలో చెప్పాలంటే.. మెస్సీ నెల ఆదాయం సుమారుగా రూ. 41.67 కోట్లకుపైనే సంపాదిస్తున్నారు. అంటే ఏడాదికి దాదాపుగా రూ. 500 కోట్లు అన్నమాట.
Messi Flight: మెస్సీ ప్రయాణించిన విమానం ఖర్చు ఎంతో తెలిస్తే అవాక్కవాల్సిందే? అంత ప్రత్యేకత ఏంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








