Viral Video: హెల్మెట్ లేకుండా డ్రైవింగ్.. ఆపిన ట్రాఫిక్ పోలీస్ కు ఊహించని షాక్ ఇచ్చిన బైకర్
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రోడ్డు రవాణా శాఖతో పాటు, అధికారులు, ప్రభుత్వాలు కోరుతున్నాయి. హెల్మెట్ వాడకంపై వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హెల్మెట్‌కు సంబంధించిన ఒక వింత వార్త వైరల్ అవుతోంది.. ట్రాఫిక్ పోలీస్ అధికారి ఏకంగా హెల్మెట్ తయారీ సంస్థలకు చేతులు జోడించి ఒక విన్నపం చేస్తున్నాడు.. ఇంతకీ అదేంటంటే..

హెల్మెట్.. కేవలం ఒక ఫ్యాషన్ వస్తువు కాదు..మీ ప్రాణాలను కాపాడే రక్షణ కవచం. అందుకే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే ప్రమాదాల సమయంలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రోడ్డు రవాణా శాఖతో పాటు, అధికారులు, ప్రభుత్వాలు కోరుతున్నాయి. హెల్మెట్ వాడకంపై వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హెల్మెట్‌కు సంబంధించిన ఒక వింత వార్త వైరల్ అవుతోంది.. ట్రాఫిక్ పోలీస్ అధికారి ఏకంగా హెల్మెట్ తయారీ సంస్థలకు చేతులు జోడించి ఒక విన్నపం చేస్తున్నాడు.. ఇంతకీ అదేంటంటే..
సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇది ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ అవశ్యకత, అందులోనే కాస్త హాస్యం కలగలిసిన సంఘటన ఇది. ఈ వీడియోలో భారీ శరీరంతో ఒక వ్యక్తి బైక్ నడుపుతూ వస్తున్నాడు.. అతడు తలకు హెల్మెట్ లేకుండానే బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. దాంతో ట్రాఫిక్ పోలీసు అతన్ని అడ్డుకున్నాడు.. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నందుకు ప్రశ్నించాడు..అందుకు ఆ బైకర్ చెప్పిన సమాధానం ఈ వీడియోను వైరల్‌గా మార్చేసింది.
బైకర్‌ను అడ్డుకున్న ట్రాఫిక్ పోలీస్.. హెల్మెట్‌ఎక్కడ అని అడగగా.. ఆ వ్యక్తి నవ్వుతూ సర్.. నా తల సైజు హెల్మెట్ లేదు అని చెప్పాడు. అది విన్న ట్రాఫిక్ పోలీసు నమ్మలేదు. అతను తన సొంత హెల్మెట్ తీసి సదరు వ్యక్తి తలపై పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ, అది అతని తలపై సగం కూడా వెళ్లకుండానే ఆగిపోయింది. ఇది చూసి, అక్కడ ఉన్నవారు కూడా నవ్వుతారు. దాంతో ట్రాఫిక్ పోలీస్ కూడా నవ్వుతూ..ఇలాంటి భారీ శరీరం కలిగిన వ్యక్తులకు సరిపడే సైజులో హెల్మెట్లు తయారు చేయాలని కోరుతూ కంపెనీలను అభ్యర్థిస్తున్నాను. అతను తన రెండు చేతులు జోడించి.. ప్రతి సైజులో హెల్మెట్లు తయారు చేయండి అని అంటాడు. ఈ వీడియో కోపం లేదా జరిమానా బెదిరింపులను చూపించదు… కానీ మానవీయ కోణంలో అవగాహన కలిపిస్తూ.. సానుకూల సందేశాన్ని చూపిస్తుంది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ వీడియో మధ్యప్రదేశ్ నుండి వచ్చిందని తెలిసింది. @vivekanandtiwarithetrafficcop అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేయబడింది. వీడియో శీర్షిక కూడా అంతే ఖచ్చితమైనదిగా ఉంది. హెల్మెట్లు అందరికీ అవసరం. కాబట్టి అన్ని సైజుల హెల్మెట్లు తయారు చేయాలని కోరుతూ కంపెనీలను అభ్యర్థిస్తున్నారు.
కొన్ని గంటల్లోనే, ఈ వీడియోకు 973,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.”ఇలాంటి పోలీసులు ప్రతిచోటా ఉండాలి అంటూ చాలా మంది కామెంట్ చేశారు. ఒక వినియోగదారు ఇది జరిమానా కాదు, ఇది అవగాహన అని రాశారు. మరొక వినియోగదారు ఇప్పుడు నాకు నిజంగా XXL హెల్మెట్ అవసరం అని రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




